గత ఏడాది CES (కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో)లో LG మడిచిపెట్టడానికి వీలుపడే screenలను ప్రదర్శించింది. ఆ కోవలో తాజాగా ఈఏడాది CESలో ఏకంగా 65 అంగుళాల మడిచి పెట్టగలిగే TV screenని ప్రకటించింది.
Samsung సంస్థ ఇదే విధంగా ఓ పేటెంట్ ఫైల్ చేసినప్పటికీ LG ఓ అడుగు ముందుకు వేసి ఈ టెక్నాలజీని ప్రొడక్షన్ దశకి చేర్చింది. ఫోల్డబుల్ టివి అంటే చిన్న సైజ్, తక్కువ రిజల్యూషన్‌ది కాదు.. 65 అంగుళాల Ultra HD OLED display. చాలా అద్భుతమైన దృశ్య నాణ్యతని ఇది కలిగి ఉంటుంది.
ఈ టివిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే.. అవసరం లేనప్పుడు దీన్ని ఫోల్డ్ చేసుకుని పక్కన పడేసుకోవచ్చు. టివి టెక్నాలజీలో Plasma, LCD, LED, OLED, 3D, HDR వంటి రకరకాల టెక్నాలజీలు వస్తున్నా ఇప్పటి వరకూ TV అంటే చాలా స్థలం ఆక్రమిస్తుంది అన్న తప్పనిసరి ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు స్పేస్ గురించి ఆలోచించాల్సిన పనిలేదు.
ప్రస్తుతానికి ఈ టివి పూర్తి స్థాయి ఉత్పత్తి మొదలు కావలసి ఉంది. అతి త్వరలో ఇది అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ LD foldable TV ఎలా పనిచేస్తుందో ఈ క్రింది వీడియోలో చూడొచ్చు.