మరింత వేగంగా ఫైళ్లని ట్రాన్స్ఫర్ చేయడానికి USB 3.2 వస్తోంది!

USB 3.2 coming to desktop computers

రెండు డివైజ్ల మధ్య  డేటాని ట్రాన్స్ఫర్ చేయడం కోసం చాలా సందర్భాల్లో మనం USB పోర్ట్ వాడుతూ ఉంటాం.  స్మార్ట్ఫోన్ వంటి వాటిలో ఫోన్ చార్జింగ్ పెట్టడం మొదలుకుని, OTG ద్వారా పెన్ డ్రైవ్ ల వంటివి కనెక్ట్ చేయడం వరకు USB పోర్టులు పనికొస్తూ ఉంటాయి.

కంప్యూటర్లలో కూడా ఎక్స్టర్నల్ హార్డ్ డిస్కులు,  పెన్ డ్రైవ్ లు వంటివి కనెక్ట్ చేయడం కోసం USB పోర్టులు  ఉపయోగపడతాయి అన్న విషయం చాలా మందికి తెలిసిందే. ఇప్పటివరకు అధికశాతం డెస్క్టాప్ కంప్యూటర్లలో USB 2.1 పోర్టులు  మాత్రమే లభిస్తున్నాయి. మరి కొన్ని తాజా మదర్ బోర్డులలో USB 3.0 పోర్టులూ ఉంటున్నాయి. అయితే దాని కంటే మరింత ఎక్కువ స్పీడ్ కోసం 2019లోనే USB 3.2 పోర్టులు  డిస్టబ్ కంప్యూటర్లకి అందుబాటులోకి రాబోతున్నట్లు గా తెలుస్తోంది.

అంటే వీటి ద్వారా, మరింత వేగవంతమైన ట్రాన్స్ఫర్ రేట్ సాధించే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు మీ దగ్గర ఉన్న ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ లో నుండి GBల కొద్దీ సినిమాలూ, ఇతర ఫైళ్లని  అతి తక్కువ సమయంలోనే కంప్యూటర్ లోకి కాపీ చేసుకోవచ్చు, కంప్యూటర్లోని డేటాను ఎక్స్టర్నల్ హార్డ్‌డిస్కులోకి బ్యాకప్ తీసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇంతకు ముందు చెప్పినట్లుగా ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం,  2019లో USB 3.2 కోవకు చెందిన మదర్ బోర్డులు రాబోతుండగా, 2020లో ఈ టెక్నాలజీని సపోర్ట్ చేసే ఎక్స్టర్నల్ హార్డ్ డిస్కులు, ఇతర రకాల డివైజ్లు విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేవలం మదర్ బోర్డు మీద USB 3.2 పోర్టులు  ఉన్నంత మాత్రాన సరిపోదు. దానిని సపోర్ట్ చేస్తే ఇతర గ్యాడ్జెట్స్ ఉన్నప్పుడు మాత్రమే వీటి ద్వారా మనం మెరుగైన ఫలితాలు పొందగలుగుతాం.

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

Tags:

Computer Era
Logo