మార్చి మొత్తంమీద ఇండియాలో ఇంటర్నెట్ స్పీడ్ బాగా తగ్గిపోయిందట.. తాజా నివేదిక

internet speed down

ఇంటర్నెట్ స్పీడ్ చెక్ చేయడానికి చాలామంది Speed test అప్లికేషన్ వాడుతూ ఉంటారు కదా. దాన్ని తయారు చేసిన Ookla సంస్థ తాజాగా ఆసక్తికరమైన గణాంకాలు వెల్లడించింది.

ఇండియాలో lock down కారణంగా మార్చి 2020 లో మొబైల్ మరియు బ్రాడ్ బాండ్ ఇంటర్నెట్ స్పీడ్ లు తగ్గినట్లు ఆ సంస్థ తెలిపింది. బ్రాడ్బ్యాండ్ సేవలు విషయానికొస్తే ఫిబ్రవరి 2020 లో 39.65 Mbps సగటు స్పీడ్ కలిగి ఉన్న భారతీయ బ్రాడ్బ్యాండ్ రంగం మార్చి 2020 కి కేవలం 35.98 Mbps సగటు స్పీడును మాత్రమే కలిగి ఉంది.

మరోవైపు మొబైల్ ఇంటర్నెట్ విషయానికొస్తే, ఫిబ్రవరిలో 11.83 Mbps సగటు డౌన్లోడ్ లభించినది కాస్త, మార్చిలో కేవలం 10.15 Mbps సగటు డౌన్లోడ్ స్పీడ్ మాత్రమే భారతీయ వినియోగదారులకు లభించింది. మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ విషయంలో ప్రపంచవ్యాప్తంగా ర్యాంకింగులు చూస్తే ఇండియా 135 స్థానంలో కొనసాగుతోంది. బ్రాడ్బ్యాండ్ విషయంలో 72వ స్థానాన్ని మన దేశం కలిగి ఉంది.

మొబైల్ ఇంటర్నెట్ పరంగా ప్రపంచవ్యాప్తంగా మొదటి స్థానంలో లో, 83.52 Mbps స్పీడ్ తో UAE కొనసాగుతుండగా, బ్రాడ్బ్యాండ్ విషయంలో మాత్రం సింగపూర్ మొట్టమొదటి స్థానంలో 197.26 Mbps సగటు స్పీడుని కలిగి ఉంది. ఇండియాలో మార్చి 2020 లో ఇంటర్నెట్ స్పీడ్ తగ్గడానికి ప్రధాన కారణం lock down కారణంగా అందరూ ఇంటిదగ్గర గడపడం వలన వీడియో కంటెంట్ వినియోగం విపరీతంగా పెరగటం, ఆ కారణంతో అన్ని నెట్వర్క్ ల మీద విపరీతమైన ఒత్తిడి పెరిగి అది పరోక్షంగా స్పీడ్ తగ్గటానికి కారణమైంది. కొందరు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు నెట్వర్క్ లోడ్ బ్యాలెన్స్ చేయడానికి చాలా శ్రమించాల్సి వస్తోంది.

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

Tags:

Computer Era
Logo