
Xiaomi సంస్థకు చెందిన Redmi Note 8 Pro, Redmi Note 7, Pocophone F1 మోడల్స్ ఉపయోగించేవారికి శుభవార్త. అనేక కొత్త సదుపాయాలతో కూడిన MIUI 12 Beta వెర్షన్ అందరికంటే ముందు మీరు ప్రయత్నించడం కోసం తాజాగా అవకాశం కలిగింది.
ఇండియా తో పాటు అనేక దేశాల్లో Mi Pilot Programలో భాగంగా MIUI 12ని మీ ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దీనికోసం మీరు ఈ లింక్ లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. కేవలం మొట్టమొదట రిజిస్టర్ చేసుకున్న వారికి మాత్రమే అవకాశం ఉంటుంది. దీంట్లో రిజిస్టర్ చేసుకోవడానికి కొన్ని అర్హతలు ఉండాలి. Xiaomi, Redmi, Poco సంస్థలకు చెందిన ఫోన్లు కలిగి ఉండాలి. కొత్త వెర్షన్ లో అందించబడిన సదుపాయాల గురించి, వాటి లోపాల గురించి ఫీడ్బ్యాక్ అందించడానికి సిద్ధంగా ఉండాలి. కొత్త వెర్షన్ ఇన్స్టాల్ చేసుకునే టప్పుడు తలెత్తే సాంకేతిక సమస్యల మీద అవగాహన కలిగి ఉండాలి. వాటికి పూర్తి బాధ్యత యూజరే వహించాలి. అలాగే Mi Account కలిగి ఉండాలి.