మీ ఫోన్లో వాయిస్ అసిస్టెంట్‌ని హ్యాక్ చేస్తే ఏమవుతుందో తెలుసా?

google home voice assistant

ఒకసారి మీ ఫోన్ ఓపెన్ చేసి OK Google… What is the weather right now అని  మాట్లాడి చూడండి. వెంటనే ప్రస్తుతం మీరు నివసిస్తున్న ప్రదేశంలో వాతావరణం ఎలా ఉందో  ఆడియో రూపంలో చెప్పబడుతుంది.

కేవలం ఫోన్లో వాయిస్ అసిస్టెంట్లు మాత్రమే కాదు, Google Home, Amazon Echo వంటి  పలురకాల హార్డ్వేర్ వాయిస్ అసిస్టెంట్‌లు కూడా ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే ఒక ఫోన్ ఎలా హ్యాక్ చేస్తారో,  మన ఫోన్లో డీఫాల్ట్ గా లభించే గూగుల్ అసిస్టెంట్ వంటివాటిని కావచ్చు, లేదా గూగుల్ హోమ్ వంటి వాటిని కొన్ని ప్రత్యేకమైన పద్ధతుల ద్వారా హ్యాక్  చేయగలిగితే, పూర్తిగా మనకు సంబంధించిన అన్ని రకాల పనులను హ్యాకర్లు చేయగలుగుతారు.

రహస్యంగా ఉండే ఆడియో ఫైల్స్ ఆధారంగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఆధారంగా పనిచేసే Apple Siri, Amazon Alexa, Google Assistant వంటి వాటిని, తను చెప్పే కమాండ్ లకు ప్రతిస్పందించే విధంగా  హ్యాకర్లు కంట్రోల్లోకి తీసుకోగలుగుతారు. ఒకసారి ఇలాంటి డివైస్ కంట్రోల్లోకి తీసుకుంటే ఇక నుండి మీ ప్రమేయం లేకుండా మీ ఫోన్ లో పలు రకాల వెబ్ సైట్లు ఆటోమేటిక్గా ఓపెన్ చేయొచ్చు, Amazon, Flipkart వంటి షాపింగ్ సైట్లలో నేరుగా మీ అకౌంట్ నుండి మీకు తెలీకుండా కొనుగోలు చేయవచ్చు.

అంతేకాదు,  మీరు సెట్ చేసుకున్న అలారంలను ఆఫ్ చేయొచ్చు.  ఇటీవలి కాలంలో హోమ్ సెక్యూరిటీ సిస్టమ్స్ పైన చెప్పబడిన వాయిస్ అసిస్టెంట్లను  సపోర్ట్ చేస్తూ ఉండడంతో.. ఒకవేళ మీరు అలాంటి ఏదైనా హోం సెక్యూరిటీ సిస్టం వాడుతున్నట్లయితే,  మీకు తెలియకుండానే మీ ఇంటి తలుపు ఓపెన్ అయ్యే విధంగా కమాండ్ జారీ చేయొచ్చు. లేదా మీ ఫ్రిజ్ లో టెంపరేచర్ పూర్తిగా తగ్గించవచ్చు. ఇలా ఎన్నో రకాల పనుల్ని వాయిస్ అసిస్టెంట్ లను కంట్రోల్ లోకి తీసుకోవడం ద్వారా పూర్తి చేయొచ్చు.

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

Computer Era
Logo
Enable registration in settings - general