

రోజువారి మన బిజీలో ఉండి ముఖ్యమైన స్నేహితులు, కుటుంబ సభ్యుల బర్త్డే ల సమయంలో వారిని విష్ చేయడం మర్చిపోతుటాం.
ఈ నేపథ్యంలో అలాంటి ముఖ్యమైన సందర్భాల్లో ఏ మాత్రం మర్చిపోకుండా, Whatsapp ద్వారా మీ ప్రమేయం లేకుండానే ఆటోమేటిక్గా సంబంధిత వ్యక్తులకు విషెస్ వెళ్లేలా ఏర్పాటు చేయాలంటే Google Play Storeలో లభించే SKEDit అనే అప్లికేషన్ ప్రయత్నించండి. దీన్ని ఈ లింక్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత, మన అకౌంట్ లోకి సైనిన్ కావాలి. ఆ తర్వాత ఏ అప్లికేషన్ ద్వారా స్కెడ్యూల్ మెసేజ్ పంపించాలి అనుకుంటున్నదీ, అక్కడ ఉండే జాబితా నుండి సెలెక్ట్ చేసుకోవాలి.
కేవలం Whatsapp మాత్రమే కాకుండా, sms, email, call, Facebook వంటి వివిధ రకాల ఆప్షన్స్ని ఇది మనకు అందిస్తుంది. ఇక్కడ ప్రస్తుతం మనం వాట్స్ అప్ వాడాలి అనుకుంటున్నాం కాబట్టి, ఆ జాబితా నుండి Whatsappని సెలెక్ట్ చేసుకుని వెంటనే వచ్చే స్క్రీన్ లో, ఏ మెసేజ్ పంపాలి అనుకుంటున్నదీ దాన్ని టైప్ చేసి, ఎవరికైతే పంపాలో వారి కాంటాక్ట్ నెంబర్, ఏ సమయంలో మెసేజ్ పంపాలి అన్నది ఆ సమయాన్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక మీదట ఆటోమేటిక్గా మన ప్రమేయం లేకుండా ఆ మెసేజ్ వెళ్ళిపోతుంది.
ఒక నిర్దిష్టమైన సమయానికి ఆటోమేటిక్గా మళ్లీ మళ్లీ మెసేజ్ వెళ్లే విధంగా కూడా దీని ద్వారా ఏర్పాటు చేసుకోవచ్చు. మెసేజ్ వెళ్లడానికి ముందు ఒకసారి మీకు మీరు కన్ఫర్మ్ చేసుకునే అవకాశం కూడా లభిస్తుంది. ఒకవేళ దీంట్లో ప్రీమియం వెర్షన్ కొనుగోలు చేస్తే అదనంగా మరికొన్ని సదుపాయాలు లభిస్తాయి. ఖచ్చితంగా అనేక సందర్భాలలో ఈ అప్లికేషన్ బాగా ఉపయోగపడుతుంది. ప్రయత్నించి చూడండి. ఎవరికైనా ఎస్ఎంఎస్ మెసేజ్ లు, ఫోన్ కాల్స్ ఆటోమేటిక్గా చేయాలన్న కూడా దీన్ని ఉపయోగించవచ్చు.