

ఇటీవలికాలంలో Virtual reality కంటెంట్ వినియోగం బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే Android phoneలను ఉపయోగించే వారి కోసం అందుబాటులో ఉన్న వివిధ రకాల Android Appsని ఇప్పుడు చూద్దాం.
Google Cardboard
వర్చ్యువల్ రియాలిటీ హెడ్సెట్ వాడుతున్న వారికి గూగుల్ అందిస్తున్న అది కాళికా అప్లికేషన్ ఇది. దీనిని డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా కార్డు బోర్డు ఆధారంగా పనిచేసే అనేక రకాల అప్లికేషన్స్ అంతర్గతంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, వర్చువల్ రియాలిటీ వీడియోలు చూడొచ్చు, 3D డెమోస్ చూడొచ్చు.
Youtube VR
యూట్యూబ్ లో కేవలం మామూలుగా చూడడం కాకుండా అందులో లభించే కొన్ని వీడియోలను వర్చువల్ రియాలిటీ లో చూడడం కోసం ఈ అప్లికేషన్ ఉపయోగపడుతుంది. ఆండ్రాయిడ్ ఫోన్లని సపోర్ట్ చేసే అన్ని రకాల వర్చువల్ రియాలిటీ హెడ్సెట్లను ఇది సపోర్ట్ చేస్తుంది. మెరుగైన వీడియో ఎక్స్పీరియన్స్ కోసం దీనిని ప్రయత్నించవచ్చు.
Google Daydream
గూగుల్ సంస్థ అధికారికంగా విడుదల చేసిన మరో వర్చువల్ రియాలిటీ అప్లికేషన్ ఇది. అయితే ప్రస్తుతం అది యాక్టివ్ గా సపోర్ట్ చేయకపోయినా అందులో భారీ మొత్తంలో కంటెంట్ లభిస్తుంది. ఈ అప్లికేషన్ వాడాలంటే తప్పనిసరిగా మీ దగ్గర DayDream సపోర్ట్ చేసే ఫోన్ ఉండాల్సి ఉంటుంది. VR videoలు, ఇతర అనేక రకాల కంటెంట్ దీంట్లో ఉంటుంది.