మీ computer స్క్రీన్‌ని వైర్‌లెస్‌గా TV మీద చూడాలంటే ఈ టెక్నిక్!

How to cast your computer on smart tv wirelessly

Miracast అనే టెక్నాలజీని ఉపయోగించి మీ computer స్క్రీన్ మొత్తాన్ని ఉన్నదున్నట్లుగా వైర్లెస్గా మీ ఇంట్లో ఉన్న smart tv మీద చూసే అవకాశం కలుగుతుంది. దానికి సంబంధించిన ప్రొసీజర్ ఇక్కడ చూద్దాం.

ఇక్కడ ప్రధానంగా మీ దగ్గర WiFi సదుపాయం కలిగిన smart tv తప్పనిసరిగా ఉండాలి. అలాగే మీ కంప్యూటర్ ఏ వై-ఫై నెట్వర్క్‌కైతే కనెక్ట్ అయ్యిందో, సరిగ్గా అదే నెట్వర్క్‌కి మీ స్మార్ట్ టీవీ కూడా కనెక్ట్ చేయబడి ఉండాలి. మీ కంప్యూటర్లో మరియు స్మార్ట్ టీవీ లోనూ బ్లూటూత్ సదుపాయం తప్పనిసరిగా ఉండాలి. ఇక అన్నిటికంటే చివరి రిక్వైర్మెంట్ మీ computer, tv రెండూ కూడా Miracast టెక్నాలజీ ని సపోర్ట్ చేయాలి. మీ Windows 10 కంప్యూటర్ లో Connect అనే అప్లికేషన్ ఓపెన్ చేసి మీ కంప్యూటర్కి ఈ సపోర్టు ఉందో లేదో పరిశీలించవచ్చు.

ఇప్పుడు మీ smart tvలో Input అనే విభాగంలోకి వెళ్లి Screen Mirroring లేదా Project అనే పేరుతో కనిపించే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే అదే సమయంలో మీ computerలో Settings> Devices అనే విభాగంలోకి వెళ్లి Bluetooth & other devices అనే విభాగంలో Add Bluetooth or other device అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత వచ్చే స్క్రీన్ లో Wireless display or dock అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. వెంటనే స్క్రీన్ మీద వచ్చే డివైస్ జాబితాలో Smart TV అనే దాన్ని సెలెక్ట్ చేసుకొని TV మీదకు casting మొదలుపెట్టవచ్చు.

సరిగ్గా ఇప్పటినుండి మీరు మళ్లీ మీరు నిలిపి వేసే వరకు మీ కంప్యూటర్ స్క్రీన్ మీద ఉన్న దృశ్యాలు మొత్తం ఉన్నది ఉన్నట్లుగా మీ టీవీ స్క్రీన్ మీద చూపించబడతాయి. మీరు ఓపెన్ చేసే అన్ని ప్రోగ్రాములు టీవీ స్క్రీన్ మీదకు వచ్చేస్తాయి. కొన్ని సందర్భాలలో మీ కంప్యూటర్ లో ఉండే ఏదైనా వీడియో ఫైల్ ని నేరుగా టీవీ లోకి క్యాస్టింగ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. దీనికి మీరు చేయాల్సిందల్లా మీ కంప్యూటర్లో Network discovery, File and printer sharing అనే సదుపాయాలు ఎనేబుల్ చేసి, మీరు ఏ వీడియో ఫైల్ అయితే టీవీ మీదకు క్యాస్టింగ్ చేయాలి అనుకుంటున్నారో దాని మీద రైట్ క్లిక్ చేసి Cast to Device అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది.

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

Computer Era
Logo
Enable registration in settings - general