“కొత్తగా iPhone కొన్నాను, ఎంత బాగుందో చూడండి” అని గర్వంగా Facebookలో పోస్టులు చేస్తుంటాం. అలాగే కార్ షోరూమ్‌లోనే కొత్త కారు ముందు ఫొటో దిగి మురిసిపోతూ Facebookలో షేర్ చేసే వాళ్లనూ చూస్తుంటాం. ఇకపై ఇవన్నీ మెడకు చుట్టుకోబోతున్నాయి.
ఇన్‌కం టాక్స్ డిపార్ట్‌మెంట్ Big data ద్వారా దాదాపు ప్రతీ ఒక్కరి Facebook, Twitter ప్రొఫైళ్లని ఎప్పటికప్పుడు మోనిటర్ చేసే పనికి పూనుకోబోతోంది. ఆదాయం తక్కువ చూపించి, ట్యాక్సులు కట్టకుండా జల్సాలు చేస్తూ Facebookలో ఫోజులు కొట్టే వారి పని పట్టాలని భావిస్తోంది. Social media ప్రొఫైళ్లని స్కాన్ చేసి కీలకమైన సమాచారాన్ని సేకరించే అనలటిక్స్ టూల్ కోసం గత ఏడాది ఆదాయపు పన్ను శాఖ టెండర్లని పిలిచింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి ఈ టూల్ ద్వారా ఇక దేశ ప్రజల సోషల్ మీడియా ప్రొఫైళ్లపై కూడా కన్నేయాలని ఐ.టి. శాఖ ఆలోచిస్తోంది.
కేవలం వస్తువులు కొనడం మాత్రమే కాదు.. విదేశాలు వెళ్లినప్పుడు, రకరకాల ట్రిప్‌ల్లో ఉన్నట్లు కూడా కొంతమంది locationని షేర్ చేస్తుంటారు. అలాంటి ఖరీదైన ట్రిప్‌ల మీద కూడా ఆదాయపు పన్ను శాఖ దృష్టి పెట్టనుంది. 2017 – 2018 ఆర్థిక సంవత్సరం నుండి అమల్లోకి వచ్చే ఈ ప్రాజెక్ట్‌కి రూ. 1000 కోట్లు ఆ శాఖ వెచ్చించింది. దీన్ని బట్టే ఇది ఎంత పకడ్భంధీగా చెయ్యబడుతోందో అర్థం చేసుకోవచ్చు.