మీ phoneలో ఈ అప్లికేషన్లు వాడుతుంటే అప్రమత్తంగా ఉండండి!

phone vpn apps security loopholes

ప్రపంచవ్యాప్తంగా ఉండే అనేక సెక్యూరిటీ సంస్థలు ఎప్పటికప్పుడు phone వినియోగదారులకు అందుబాటులో ఉండే వివిధ రకాల అప్లికేషన్ల సెక్యూరిటీ లోపాల గురించి సమాచారం అందిస్తూనే ఉంటాయి.

అందులో భాగంగా తాజాగా VPN ప్రోగ్రామ్ల పనితీరు గురించి పరిశోధిస్తూ ఉండే VPN Pro అనే సంస్థ కీలకమైన విషయాలను వెల్లడించింది. ఇటీవలి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా వర్క్ ఫ్రం హోం కల్చర్ ఎక్కువ కావడంతో అధిక శాతం మంది VPN అప్లికేషన్లు వాడుతున్నారు. ఈ నేపథ్యంలో బాగా పాపులర్ అయిన కొన్ని VPN అప్లికేషన్లలో సెక్యూరిటీ లోపాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.

ప్రధానంగా బాగా పాపులర్ అయిన CyberGhost, Hotspot Shield, PrivateVPN, Betternet వంటి సంస్థలకు చెందిన VPN అప్లికేషన్లు సెక్యూరిటీ లోపాలను కలిగి ఉన్నట్లు వెల్లడైంది. వీటిని వాడే వినియోగదారులకు, ఒక నకిలీ అప్డేట్ రూపంలో, ఆ వ్యక్తి యొక్క ఫోన్ లోకి చాలా సులభంగా ప్రవేశించటానికి అవకాశం ఉన్నట్లు VPN Pro పరిశోధనా సంస్థ గుర్తించింది.

ప్రధానంగా ఇది పబ్లిక్ వై-ఫై నెట్వర్క్ వాడే సందర్భంలో హ్యాకర్లు ఇతరుల డివైజ్లలోకి చాలా సులభంగా వెళ్ళటానికి ఆస్కారం కల్పిస్తోంది. అనేక సందర్భాలలో పబ్లిక్ వైఫైకి కనెక్ట్ అయ్యే వినియోగదారులు తమ డేటాకు రక్షణ పొందటం కోసం, అదనపు సెక్యూరిటీ లభిస్తుందని VPN అప్లికేషన్ లను కొనుగోలు చేయడం లేదా ఉచిత యాప్స్ వాడుతూ ఉంటారు. సరిగ్గా అదే సందర్భంలో, మనం కనెక్ట్ అయి ఉన్న వైఫై నెట్వర్క్ కి కనెక్ట్ అయిన హ్యాకర్ ఒక నకిలీ సాఫ్ట్వేర్ అప్డేట్ స్క్రీన్ మన ఫోన్ మీద చూపించి సులభంగా ఫోన్ హ్యాక్ చేయొచ్చు.

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

ఈ లోపాల గురించి VPN Pro సంస్థ ఇప్పటికే సంబంధిత VPN అప్లికేషన్ డెవలపర్లకు సమాచారం అందించింది. అయితే ప్రస్తుతానికి కేవలం PrivateVPN, Betternet అప్లికేషన్లు మాత్రమే లోపాలను పూడుస్తూ వాటికి సంబంధించిన తాజా అప్డేట్స్ విడుదల చేశాయి. మిగిలిన రెండు సంస్థలు కూడా ఇప్పటివరకు స్పందించలేదు. కాబట్టి వినియోగదారులు తమ జాగ్రత్తలో తాము ఉండటం మంచిది.

Tags:

Computer Era
Logo