మీ phoneలో నోట్స్ రాసుకోవడానికి 5 సూపర్ యాప్స్!

5 powerful note taking apps for Android

రకరకాల సందర్భాల్లో ముఖ్యమైన నోట్స్ రాసుకోవడానికి Android యూజర్ల కోసం అనేక శక్తివంతమైన అప్లికేషన్స్ లభిస్తున్నాయి. వాటి వివరాలు ఇక్కడ చూద్దాం.

Google Keep

గూగుల్ సంస్థకు చెందిన ఉచిత అప్లికేషన్ ఇది. ఎప్పటికప్పుడు మీరు రాసుకున్న నోట్స్ క్లౌడ్ బ్యాకప్ తీయబడుతుంది. చాలా సులభమైన యూజర్ ఇంటర్ఫేస్ కలిగి ఉండి చేయాల్సిన పనుల కోసం to do listలను తయారు చేసుకోవడం, ఫోటోలు సేవ్ చేసుకోవడం, వాయిస్ మెమోలు రికార్డ్ చేసుకోవడం వంటి ఎన్నో రకాల ఆప్షన్స్ ఇది అందిస్తుంది. Google Play Storeలో ఈ లింకు నుండి దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Color Note

ఇది కూడా ఉచితంగా లభించే అప్లికేషన్. రకరకాల నోట్స్ కి రకరకాల రంగులు అప్లై చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఎల్లప్పుడు అందుబాటులో ఉండే విధంగా చిన్న sticky notes మీ హోమ్స్క్రీన్ లో అమర్చుకోవచ్చు. మీరు రాసుకున్న నోట్స్ ఇతరులు చూడకుండా పాస్వర్డ్ లాక్ చేసుకోవచ్చు. ఈ లింక్ నుండి ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Evernote

ఇది ఉచిత మరియు పెయిడ్ వెర్షన్‌గా లభిస్తుంది. దీంట్లో అజెండాలు క్రియేట్ చేసుకోవచ్చు, బిజినెస్ ప్లాన్స్, జర్నల్స్, నోట్స్, మెమోస్ వంటి అన్ని రకాల కంటెంట్ సేవ్ చేసుకోవచ్చు. అలా సేవ్ చేసుకున్న నోట్స్ మీ టీం తో షేర్ చేసుకోవచ్చు. నోట్స్‌తో పాటు డాక్యుమెంట్స్, పిడిఎఫ్‌లు, ఫోటోలు, ఆడియో ఫైల్స్ వంటి అన్నిటినీ జత చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ లింక్ నుండి దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

Microsoft OneNote

మైక్రోసాఫ్ట్ సంస్థకు చెందిన అనేక సర్వీసులతో ఇది అంతర్గతంగా ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రత్యేకంగా డౌన్లోడ్ చేసుకొని కూడా ఇన్స్టాల్ చేసుకుని వాడుకోవచ్చు. నోట్స్ రాసుకోవడం, ఏమైనా డ్రాయింగ్స్ చేసుకోవటం, ముఖ్యమైన సమాచారాన్ని క్లిప్ చేసుకోవడం, అలాగే డాక్యుమెంట్లు మరియు బిజినెస్ కార్డులను నేరుగా వన్ డ్రైవ్ లోకి స్కాన్ చేసుకోవడం, నోట్స్‌కి ఫోటోలు జత చేసుకోవడం వంటి అనేక రకాల పనులను ఈ అప్లికేషన్ ద్వారా పూర్తి చేసుకోవచ్చు. ఈ లింకు నుండి ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Sticky Notes

ఇది కూడా ఫ్రీ మరియు పెయిడ్ వెర్షన్ లభిస్తూ ఉంటుంది. ముఖ్యమైన నోట్స్ మొత్తాన్ని sticky notes రూపంలో ఇది సేవ్ చేసి పెడుతుంది. sticky notes వాడటం బాగా అలవాటు ఉన్నవారికి ఇది కచ్చితంగా నచ్చుతుంది. మిగిలిన వాళ్ళకి కొద్దిగా అలవాటు పడటానికి సమయం పడుతుంది. ముఖ్యమైన నోట్స్ పాస్వర్డ్ ప్రొటెక్ట్ చేసుకునే అవకాశం కూడా ఇది కల్పిస్తుంది. ఈ లింకు నుండి దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Computer Era
Logo
Enable registration in settings - general