
ఊరికూరికే మీ mobile data ఖాళీ అయిపోతోందా? వాస్తవానికి మన ఫోన్లో ఇన్స్టాల్ చేయబడి ఉన్న కొన్ని అప్లికేషన్స్ మాత్రమే భారీ మొత్తంలో మొబైల్ డేటా వినియోగించుకుంటాయి. ఈ నేపథ్యంలో Android phoneలలో కొన్ని సెట్టింగ్స్ చేయటం ద్వారా మొబైల్ డేటా వినియోగం తగ్గించుకునే అవకాశం ఉంది.
దీనికోసం మీరు చేయాల్సిందల్లా Android Settingsలోకి వెళ్లి Network & Internet అనే విభాగంలోకి వెళ్లండి. ఒక్కో ఫోన్లో ఈ పేరు ఒక్కోలా ఉంటుంది. సరైన ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత, అక్కడ కనిపించే Data Saver అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా కొన్ని అప్లికేషన్స్ సర్వర్ నుండి మీ ఫోన్లోకి డేటా వచ్చే దశలోనే డేటా కంప్రెస్ చెయ్యబడి తక్కువ డేటా వినియోగించుకునే విధంగా జాగ్రత్త పడతాయి.