మీ phone screenలను రక్షించటానికి శక్తివంతమైన కొత్త టెక్నాలజీ వచ్చింది!

కొన్నేళ్ల క్రితం వరకు smartphone కింద పడితే స్క్రీన్ మీద ఆశలు వదిలేసుకోవలసి వచ్చేది. అయితే ఈ మధ్యకాలంలో మార్కెట్లో లభిస్తున్న దాదాపు అన్ని ఫోన్స్ గొరిల్లా గ్లాస్ అనే టెక్నాలజీ చేత రక్షించబడుతున్నాయి.

ఈ టెక్నాలజీని అభివృద్ధి పరిచిన Corning సంస్థ ఎప్పటికప్పుడు దాన్ని మరింత మెరుగుపరుస్తూ వస్తోంది. ఇప్పటివరకు గొరిల్లా గ్లాస్ 6 వినియోగంలో ఉన్న నేపథ్యంలో తాజాగా, ఆ సంస్థ దాని తరువాత వెర్షన్ ప్రకటించింది. ఈ కొత్త వెర్షన్ ని Gorilla Glass Victus అని పిలుస్తారు. గొరిల్లా గ్లాస్ 6 1.5 మీటర్ల ఎత్తు నుండి కింద పడిన కూడా తట్టుకోగలిగితే, కొత్తగా అందుబాటులోకి వచ్చిన Gorilla Glass Victus, ఏకంగా రెండు మీటర్ల పై నుండి ఫోన్ కింద పడినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా తట్టుకోగలుగుతుంది. అంతేకాదు గొరిల్లా గ్లాస్ పాత వెర్షన్ లతో పోలిస్తే పోలిస్తే, స్క్రీన్ మీద గీతలు పడకుండా రెండింతలు రక్షణ కల్పించగలుగుతుంది ఈ కొత్త టెక్నాలజీ.

Samsung సంస్థ అతి త్వరలో Galaxy Note 20ని విడుదల చేయబోతున్న నేపధ్యంలో అందుబాటులోకి వచ్చిన ఈ టెక్నాలజీ కచ్చితంగా ఆ ఫోన్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి గొరిల్లా గ్లాస్ కి ప్రత్యామ్నాయంగా ఇతర కంపెనీలు కూడా టెక్నాలజీలు అందిస్తున్నప్పటికీ అధిక శాతం స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీలు తమ శక్తివంతమైన ఫోన్ మోడల్స్ కి ఈ టెక్నాలజీ మాత్రమే వినియోగిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం, ఇతర టెక్నాలజీలు కేవలం తక్కువ రెసిస్టెన్స్ మాత్రమే కలిగి ఉంటున్నాయి.

సామ్సంగ్ గెలాక్సీ నోట్ 20 తర్వాత, ఈ ఏడాది రాబోయే శక్తివంతమైన స్మార్ట్ ఫోన్స్ అన్నీ కొత్తగా వచ్చిన ఈ గొరిల్లా గ్లాస్ Victus టెక్నాలజీ ద్వారా రక్షణ కల్పించే పడతాయి అనడంలో సందేహమే లేదు.

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

దానికి సంబంధించిన డెమో వీడియో కింద చూడవచ్చు.

Computer Era
Logo