మీ SIM కార్డ్ మీకు తెలియకుండా ఇలా కాజేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త!!

Airtel Reliance Jio e-SIM frauds

ఇంటర్ నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు లావాదేవీలు మొదలుకొని, Gmail, Facebook వంటి వాటిలో 2-step verification వరకూ అంతా మన మొబైల్ నెంబర్ ద్వారానే లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో మీకు తెలియకుండా మీ సింకార్డ్‌ని తమ సొంతం చేసుకోవడానికి సైబర్ నేరస్తులు అనేక కొత్త ఎత్తుగడలు పన్నుతున్నారు.

Airtel, Reliance Jio సంస్థలు Apple iPhone వంటి వాటిలో ఉపయోగించుకోవడానికి వీలుగా e-SIM సదుపాయం అందిస్తున్న విషయం తెలిసిందే. సరిగ్గా దీన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరస్తులు ఒక కొత్త ఎత్తుగడ వేశారు. దీంట్లో మొట్టమొదట మీకు ఒక మెసేజ్ వస్తుంది. “Dear customer, your SIM card will be blocked in 24 hours.” అని గానీ “Please update your eKYC verification.” అని గానీ SMS మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత ఆ సైబర్ నేరస్థుడు Airtel, Reliance Jio సంస్థల నుండి కాల్ చేస్తున్నట్లుగా మీకు ఫోన్ కాల్ చేస్తాడు. EKYC పూర్తి చేయడం కోసం మీరు 121 అనే కస్టమర్ కేర్ నెంబర్ కి eSIM అని టైప్ చేసి, ఆ తర్వాత ఆ నేరస్థుడు చెప్పిన మెయిల్ ఐడి‌ని టైప్ చేసి, SMS పంపమని కోరతాడు. రెండో ఆలోచన లేకుండా మీరు అలా చేస్తారు.

దాంతో సంబంధిత టెలికామ్ నెట్వర్క్‌లో మీకు మీరు eSIM రిక్వెస్ట్ పంపించినట్లు అభ్యర్థన స్వీకరించబడి, ఇందులో మీరు పేర్కొన్న సైబర్ నేరస్థుడి మెయిల్ ఐడికి ఆ కొత్త eSIM యాక్టివేట్ చేసుకోవడానికి కావాల్సిన QR Code పంపించబడుతుంది. దాన్ని స్కాన్ చేస్తే సరిపోతుంది.. అప్పటి వరకు పని చేస్తున్న మీ సిమ్‌కార్డ్ నిలిచిపోయి, దాని స్థానంలో సైబర్ నేరస్థుడు యాక్టివేట్ చేసుకున్న ఈ సింకార్డు పని చేయడం మొదలు పెడుతుంది. దాంతో అతను మీకు తెలియకుండా ఓటిపి పొంది మీ తరఫున మీ బ్యాంక్ అకౌంట్ మొత్తం ఖాళీ చేస్తాడు. కాబట్టి అప్రమత్తంగా ఉండండి.

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

గమనిక: Whatsappలో అన్ని లేటెస్ట్ Tech Updates కోసం https://chat.whatsapp.com/JMyfXBZdWl5BUR7SGHT3YY అనే గ్రూప్‌లో జాయిన్ అవండి. లేదా గమనిక: Telegramలో వాడేవారు లేటెస్ట్ Tech Updates కోసం https://t.me/sridharcera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.
Computer Era
Logo