

Whatsapp అకౌంట్స్ ఈ మధ్యకాలంలో విపరీతంగా హ్యాక్ అవుతున్నాయి. మీ మొబైల్ నెంబర్ తెలుసుకున్న హ్యాకర్లు, మీ నెంబర్‌తో వాట్సప్‌ని రిజిస్టర్ చేసుకోవడానికి ప్రయత్నించి, అప్పుడు జనరేట్ అయ్యే 6 డిజిట్స్ కోడ్‌ని మీ ద్వారానే తెలుసుకొని మీ అకౌంట్ కాంప్రమైజ్ చేసే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
ఈనేపథ్యంలో మీ అకౌంట్ హ్యాక్ కాకుండా ఉండాలంటే మొట్టమొదట చేయాల్సిన పని.. ఎవరైనా మీ ఫోన్ కి వచ్చిన వెరిఫికేషన్ కోడ్ చెప్పమని అడిగితే ఎట్టి పరిస్థితుల్లో చెప్పకండి. అంతేకాదు, వెరిఫికేషన్ కోడ్ SMSలో ఉండే లింక్‌ని క్లిక్ చేయకండి. ఒకవేళ పొరపాటున మీరు మీ Whatsapp అకౌంట్‌ని పోగొట్టుకున్నట్లు అయితే దీనికి రెండు మార్గాలున్నాయి.
మీ అకౌంట్ కి, మీరు గానీ, మీ అకౌంట్ హ్యాక్ చేసిన వ్యక్తి గానీ 2-స్టెఫ్ వెరిఫికేషన్ ఎనేబుల్ చేయకపోతే, మీ ఫోన్లో మీ అకౌంట్‌ని తిరిగి రిజిస్టర్ చేసుకోవడం ద్వారా, అవతలి వ్యక్తి ఫోన్ లో మీ అకౌంట్ ఆటోమేటిక్‌గా లాగ్ అవుట్ అయ్యే విధంగా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ అధికశాతం మంది హ్యాకర్లు మీ అకౌంట్‌ని వారు చేజిక్కించుకున్న వెంటనే, సెట్టింగ్స్‌లోకి వెళ్లి 2-స్టెప్ వెరిఫికేషన్ ఎనేబుల్ చేస్తున్నారు. అలాంటి సందర్భంలో ప్రస్తుతానికి మీరు చేయగలిగింది ఏమీ లేదు.
మీరు వారం రోజుల పాటు ఓపికగా వేచి ఉండాల్సి ఉంటుంది. ఆ తర్వాత తిరిగి మీ ఫోన్లో వాట్స్అప్ ఇన్స్టాల్ చేసుకొని, మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీ అకౌంట్లోకి రిజిస్టర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మర్చిపోకుండా మీ వాట్సాప్ అకౌంట్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి 2-స్టెప్ వెరిఫికేషన్ ఎనేబుల్ చేయండి.