
Xiaomi సంస్థ తయారు చేసిన ఫోన్ లను వాడే వినియోగదారులకు తాజాగా MIUI 12 పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాబోతోంది. గత నెలలో చైనాలో జరిగిన ఒక ఈవెంట్ లో MIUI 12 యూజర్ ఇంటర్ ఫేస్ ఎలా ఉంటుందో ఆ సంస్థ వెల్లడించిన విషయం తెలిసిందే. అలాగే గత కొంత కాలంగా చైనాలో కొంతమంది బేటా టెస్టర్లకి దానికి సంబంధించిన ప్రివ్యూ అందించడం జరిగింది.
ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఇండియాలో Xiaomi సంస్థ MIUI 12 పైలెట్ టెస్టింగ్ ప్రోగ్రాంని మొదలు పెట్టింది. కేవలం భారతీయ వినియోగదారులకు మాత్రమే లభించే ఈ ప్రోగ్రాం ద్వారా అందరికంటే ముందు Redmi K20 సిరీస్ ఫోన్లను వాడుతున్న వినియోగదారులు MIUI 12ని ప్రయత్నించే అవకాశం ఉంది. ఒకవేళ మీరు ఈ ఫోన్ వాడుతున్నట్లయితే, MIUI 12ని బేటా టెస్టింగ్‌లో పరిశీలించడానికి Mi Community India టెలిగ్రామ్ గ్రూప్ లో పాల్గొన వలసిన ఉంటుంది. అందులో ఒక గూగుల్ ఫామ్లో మీ సమాచారం అందించిన తర్వాత ఎవరికి బేటా యాక్సెస్ ఇవ్వాలి అన్నది నిర్ణయిస్తారు.