

మీ టివికి హోమ్ థియేటర్ అనుభూతిని అందించే సౌండ్ బార్ని రూ. 10000 లోపు కొనాలనుకుంటే బెస్ట్ మోడల్స్ ఇవి!
టాప్ 1: JBL Cinema SB 231
ఇది చాలా స్పష్టమైన, క్రిస్ప్‌గా ఉండే ఆడియోను అందిస్తుంది. దీనివల్ల టీవీ చూసే అనుభూతి పూర్తిగా మారిపోతుంది. Bass చాలా బలంగా ఉండటం వల్ల యాక్షన్ మూవీస్, మ్యూజిక్ విషయంలో మరింత ఆకర్షణగా ఉంటుంది. అలాగే mids, trele కూడా ఫోకస్డ్గా ఉండి, స్పష్టమైన శబ్దాన్ని అందిస్తూ ఉంటాయి.
JBL Cinema SB 231 సబ్-వూఫర్‌తో వస్తుంది. 110W సౌండ్ ఔట్‌పుట్‌ని ఇది అందిస్తుంది. డాల్బీ డిజిటల్ సపోర్టు కూడా ఇది కలిగి ఉంటుంది.
అలాగే రిమోట్ కంట్రోల్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. HDMI ARC పోర్ట్ ద్వారా మీ టీవీ కి దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. బ్లూటూత్, USB ఆప్టికల్ పోర్టులను ఇది కలిగి ఉంటుంది.