

Flipkart ఫిబ్రవరి 19 నుండి ప్రారంభించబోతున్న మొబైల్ బొనాంజా సేల్ లో భాగంగా ఇప్పటికే బాగా పాపులర్ అయిన అనేక ఫోన్ల మీద పెద్ద మొత్తంలో డిస్కౌంట్ లో లభించబోతున్నాయి.
యాక్సిస్ బ్యాంక్ డెబిట్ మరియు క్రెడిట్ కార్డులు వాడేవారికి 10% instant discount లభించబోతోంది. ఈ సేల్‌లో భాగంగా Realme 2 Pro ఫోన్ మోడల్ కి 1000 రూపాయలు శాశ్వతంగా ధర తగ్గించబడుతుంది. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ ఆధారంగా పనిచేసే ఈ ఫోన్ 4GB RAM కలిగిన మోడల్ ప్రస్తుతం కేవలం 11,990కి మాత్రమే లభిస్తుంది. 6.3 అంగుళాల Full HD+ స్క్రీన్ రిజల్యూషన్ తో వెనుక భాగంలో 16 మరియు 2 మెగాపిక్సల్ కెమెరాలు, ముందు భాగంలో 16 megapixel సెల్ఫీ కెమెరా దీనికి ఉంటాయి. 4,230 mAh కెపాసిటీ కలిగిన బ్యాటరీ దీంట్లో ఉంటుంది.
ఇకపోతే, డిసెంబర్ 2018 భారతీయ మార్కెట్లో విడుదలైన Redmi Note 6 Pro ధర 1000 రూపాయలు తగ్గించబడి, ప్రస్తుతం కేవలం 12,999 రూపాయలకు మాత్రమే లభిస్తుంది. ఫిబ్రవరి 28వ తేదీన Redmi Note 7 విడుదల కాబోతున్న తరుణంలో ఈ డిస్కౌంటు చోటు చేసుకోవడం గమనార్హం. 6.26 అంగుళాల Full HD+ డిస్ప్లేతో, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ ఆధారంగా పని చేస్తూ, 4GB RAM, 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన మోడల్ ఇది. Android Oreo ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే ఈ ఫోన్లో 4000 mAh కెపాసిటీ కలిగిన బ్యాటరీ లభిస్తుంది.
వీటితోపాటు భారతీయ మార్కెట్లో బాగా అమ్ముడుపోతున్న Asus Zenfone Max Pro M1 ఫోన్ 2,500 రూపాయల డిస్కౌంట్ పోనూ రేపటినుండి 8,499 రూపాయలకు లభిస్తుంది. 5.99 అంగుళాల Full HD+ డిస్ప్లేతో, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 636 processor ఆధారంగా పనిచేసే ఈ ఫోన్లో 3GB, 4GB, 6 GB RAM కలిగిన మూడు మోడళ్లు లభిస్తున్నాయి. అలాగే Asus Zenfone Max Pro M2 మోడల్ కేవలం 11999 రూపాయలకు లభిస్తుంది. 6.26 అంగుళాల డిస్ప్లేతో, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ ఆధారంగా ఇది పనిచేస్తుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో 12 మరియు 5, ముందు భాగంలో 13 మెగాపిక్సల్ కెమెరాలు ఉంటాయి. 5000 mAh కెపాసిటీ కలిగిన బ్యాటరీ దీంట్లో ఉంటుంది.