వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వైరస్ గురించి కొత్తగా విడుదల చేసిన Android, iOS యాప్ ఇక్కడ!

WHO COVID-19 Android application

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా అనేక అపోహలు కొనసాగుతున్న నేపథ్యంలో, తగిన జాగ్రత్తలు సూచించడంతో పాటు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తూ, ప్రజలను అప్రమత్తం చేయడం కోసం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రత్యేకంగా ఒక మొబైల్ అప్లికేషన్ Android, iOS ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే ఫోన్లని వాడే వారికి అందుబాటులోకి తీసుకువచ్చింది.

WHO COVID-19 అనే ఈ యాప్‌ని ఈ లింక్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. దీంట్లో ఎప్పటికప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుండి తాజా సమాచారం నోటిఫికేషన్స్ రూపంలో చూపించబడుతుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఇన్ఫెక్ట్ అయిన కేసుల సంఖ్య, చనిపోయిన వ్యక్తుల సంఖ్య లైవ్ అప్డేట్ అందిస్తుంది. ఈ వైరస్ గురించి పూర్తి స్థాయి సమాచారంతో ప్రశ్నలు మరియు సమాధానాలు కూడా దీంట్లో లభిస్తాయి.

వైరస్ గురించి అనేక మందికి ఉన్న అపోహలను తొలగించడం కోసం ఒక ప్రత్యేకమైన విభాగం అందించబడింది. ఉదాహరణకు కొంతమంది అల్ట్రావైలెట్ దీపాలు వైరస్‌ని చంపేస్తాయని తప్పుగా ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి అనేక రకాల అపోహల గురించి వివరణ ఇవ్వబడింది. వైరస్ నుండి మనల్ని కాపాడుకోవడం కోసం మనకు మనం ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవాలి అన్న విషయాలు కూడా దీంట్లో వివరంగా ప్రస్తావించబడి ఉన్నాయి.

వివిధ మీడియా సంస్థలకు తాజా సమాచారాన్ని అందిస్తూ ఒక ప్రత్యేకమైన విభాగాన్ని కూడా ఈ అప్లికేషన్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కలిగి ఉంది. అప్లికేషన్ యూజర్ ఇంటర్ ఫేస్ కూడా చాలా సులభంగా ఉంది. ఏమాత్రం టెక్నికల్ నాలెడ్జ్ లేని వారైనా దీన్ని చాలా సులభంగా ఉపయోగించవచ్చు. అయితే సమాచారం మాత్రం ఇంగ్లీషులో మాత్రమే లభిస్తుంది. నిక్కచ్చి సమాచారాన్ని తెలుసుకోవడం కోసం ఖచ్చితంగా ప్రయత్నించవలసిన అప్లికేషన్ ఇది.

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

Tags:

Computer Era
Logo
Enable registration in settings - general