వీరికి బ్యాంకు సేవలు ఇంటి దగ్గరే అందించేలా RBI ఏర్పాట్లు చేస్తోంది!

internet banking RBI guidelines

బయట నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో చాలా మంది బ్యాంకులకు వెళ్లి తమ బ్యాంకింగ్ కార్యకలాపాలు కొనసాగించటం చాలా కష్టంగా ఉంటోంది. మరీ ముఖ్యంగా తాజా వైరస్ కారణంగా సీనియర్ సిటిజన్స్ మరి అంత ఇబ్బంది ఎదుర్కొంటున్న నేపధ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది.

70 సంవత్సరాల కంటే వయసు పైబడిన సీనియర్ సిటిజన్స్ కు ప్రాథమికమైన బ్యాంకింగ్ సేవలు నేరుగా వారి ఇంటి దగ్గర అందించే విధంగా ఏర్పాట్లు చేయాలని దేశంలోని అన్ని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పౌరులకు కూడా బ్యాంకులు ఈ సేవలు ఇంటి దగ్గర అందించాల్సి ఉంటుంది. వాస్తవానికి డిసెంబర్ 2017 నుండి పాక్షికంగా ఈ ఆదేశాలు అమలుపరచ పడుతున్నప్పటికీ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో దీనిని కచ్చితంగా అమలు పరచాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా సర్క్యులర్ జారీ చేసింది.

ఇదిలా ఉంటే మరోవైపు internet banking, mobile banking, UPI తదితర సేవలు వినియోగదారులకు నేరుగా బ్యాంకు కి వెళ్లాల్సిన పని లేకుండానే అనేక రకాల లావాదేవీలు చేసుకునే విధంగా చాలాకాలం నుండి అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా అనేక మంది సీనియర్ సిటిజన్స్ వీటి ద్వారా ప్రయోజనం పొందుతున్నారు కూడా! అయితే ఏవైతే సేవల కోసం బ్యాంకుల దగ్గరకు వెళ్లడం కష్టంగా ఉంటుందో అలాంటి సేవల విషయంలో నేరుగా సీనియర్ సిటిజన్స్ కి వాటిని వారి ఇంటి దగ్గర అందించడం ఖచ్చితంగా ఒక ఆహ్వానించదగ్గ పరిణామం.

వివిధ బ్యాంకులు దేశవ్యాప్తంగా కలిగి ఉన్న బ్రాంచీలలో, ఏ బ్రాంచీలు ఇలా నేరుగా ఇంటి వద్ద సేవలు అందిస్తున్నాయో, వాటికి సంబంధించిన సమాచారం ఆయా బ్యాంకుల వెబ్సైట్లలో నిక్షిప్తం చేయాలని కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోరింది. దీంతోపాటు KYC వివరాలు కలిగి ఉన్న అన్ని ఎకౌంట్లు, ఆ అకౌంట్ హోల్డర్ 60 సంవత్సరాలు పైబడిన వెంటనే ఆటోమేటిక్గా వారి అకౌంట్ సీనియర్ సిటిజన్ అకౌంట్‌గా దానంతట అదే మార్పిడి జరిగే విధంగా కూడా ఏర్పాటు చేయాలని RBI ఆదేశించింది.

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

Tags:

Computer Era
Logo
Enable registration in settings - general