షామీ ఫోన్లు ప్రభుత్వ నిర్ణయంతో వెనక పడతాయా?

షామీ ఫోన్లు

తాజాగా కేంద్ర ప్రభుత్వం ఇ-కామర్స్  వెబ్సైట్ల విషయంలో అతి కీలకమైన నిర్ణయం తీసుకుంది. అది పరోక్షంగా  ఆన్ లైన్ షాపింగ్ వెబ్ సైట్ల ద్వారా పెద్ద మొత్తంలో అమ్మకాలు జరుపుతున్న షామీ, OnePlus, Huawei వంటి  కంపెనీలకు ఇబ్బందికరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

క్షణాల్లో అమ్మకాలు ఇలా!

ఇప్పటివరకు Amazon, Flipkart  వంటి ఆన్లైన్ షాపింగ్ సైట్లు, Xiaomi, OnePlus, Realme వంటి  ఫోన్ తయారీ కంపెనీలతో ప్రత్యేకంగా ఒప్పందాలు కుదుర్చుకుని, ఎప్పటికప్పుడు లేటెస్ట్ మోడళ్లని flash sales ద్వారా హాట్‌కేకుల్లా అమ్ముతున్నాయి. షామీ వంటి  సంస్థలు ఏదైనా కొత్త ఫోన్ విడుదలైన వెంటనే, కేవలం ఒకే ఒక నిమిషంలో లక్షలాది ఫోన్లు అమ్ముడైనట్లు చాలా గొప్పగా ట్వీట్ చేయగలుగుతున్నాయి అంటే, దీని ప్రధాన కారణం ఆన్లైన్ షాపింగ్ సైట్లు వాటికి సహకరించడం.

నియమాలు ఇవి..

అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం,  వివిధ ఆన్లైన్ షాపింగ్ సైట్లు ఫోన్ తయారీ కంపెనీలతో చేసుకునే గరిష్ట ఒప్పందాల విషయంలో పరిమితి విధించబడింది.  అంతేకాదు, ఇప్పటివరకు షామీ వంటి ఫోన్ తయారీ కంపెనీలు తమ వద్ద స్టాక్ ఉన్నంత వరకు, ఎలాంటి పరిమితి లేకుండా, అన్ని యూనిట్లనీ  ఆన్లైన్లో అమ్ముతూ వచ్చేవి. తాజాగా విధించబడిన నియమాల ప్రకారం, ఫోన్ తయారీ కంపెనీలు గరిష్టంగా 25 శాతానికి మించి తమ వద్ద ఉన్న ఇన్వెంటరీని  ఇ-కామర్స్ వెబ్సైట్ల ద్వారా అమ్మడానికి వీలు పడదు. ఫిబ్రవరి 1 నుండి ఈ నియమాలు అమల్లోకి రాబోతున్నాయి. పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టి ఆఫ్‌లైన్‌లో  మొబైల్ షా‌ప్‌లు నిర్వహిస్తున్న వ్యాపారులకు ఈ నిర్ణయం చాలా మేలు చేయబోతోంది.

షామీకి ఎలా నష్టం?

ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కేవలం సాంసంగ్ సంస్థకు మాత్రమే అతి పెద్ద మొత్తంలో ఆఫ్‌లైన్ మార్కెట్ షేర్ ఉంది.  దేశవ్యాప్తంగా అనేక మొబైల్ షాప్‌లతో సామ్సంగ్ సంస్థకు ఒప్పందాలు ఉన్నాయి. అంతేకాదు, తనకు తాను స్వయంగా షోరూములు కూడా నిర్వహిస్తోంది. ఈ విషయంలో షామీ  వంటి కంపెనీలు వెనకబడి ఉన్నాయి. ఇప్పుడు తప్పనిసరిగా ఈ చైనా కంపెనీలు తమ ఆఫ్లైన్ షాపుల సంఖ్యను పెంచుకోకపోతే అమ్మకాల విషయంలో గడ్డు పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం లేకపోలేదు. ఇటీవల షామీ కంటే  వెనకబడిన సామ్సంగ్ సంస్థకు ఇది పరోక్షంగా మేలు చేస్తుంది.

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

గమనిక: Whatsappలో అన్ని లేటెస్ట్ Tech Updates కోసం https://chat.whatsapp.com/JMyfXBZdWl5BUR7SGHT3YY అనే గ్రూప్‌లో జాయిన్ అవండి. లేదా గమనిక: Telegramలో వాడేవారు లేటెస్ట్ Tech Updates కోసం https://t.me/sridharcera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.
      Computer Era
      Logo