OnePlus సంస్థ ఇటీవల OnePlus Buds Proని మార్కెట్లోకి తీసుకు వచ్చింది. అమెజాన్ లో https://amzn.to/3zMRf28 లింక్‌లో రూ. 9,990కి లభిస్తున్న ఈ మోడల్‌ని అంత ధర పెట్టి కొనొచ్చా లేదా అన్నది వివరంగా ఇక్కడ చూద్దాం.
క్లుప్తంగా చెప్పాలంటే!
చుట్టూ శబ్దాలు తగ్గి, మాటలు స్పష్టంగా వినిపించడానికి మెరుగైన యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, Qi వైర్లెస్ ఛార్జింగ్, సుధీర్ఘమైన బ్యాటరీ బ్యాకప్ వంటి సదుపాయాలతో కచ్చితంగా ధరకు తగ్గ పనితీరు కలిగిన మోడల్ ఇది అని చెప్పాలి.
11mm సామర్ధ్యం కలిగిన రెండు డైనమిక్ డ్రైవర్స్ దీంట్లో పొందుపరచబడి ఉంటాయి. 20Hz నుండి 20 kHz మధ్య ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ రేంజ్‌ని ఇవి కలిగి ఉంటాయి. SBC, AAC, LDHC ఆడియో కొడెక్స్‌ని ఇవి సపోర్ట్ చేస్తాయి.
సౌండ్ సిగ్నేచర్ విషయానికొస్తే ఒకపక్క బాస్‌ని హైలెట్ చేస్తూనే మరోపక్క midsని కూడా మెరుగ్గా అందించే విధంగా ఈ earbuds ఆహ్లాదకరమైన శబ్దాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి. పాటలు వినేటప్పుడు మ్యూజిక్ మరియు లిరిక్స్ దేనికది స్పష్టంగా వ్యత్యాసం కలిగి ఉండి వినిపిస్తాయి. దీనివల్ల మరింత అద్భుతంగా మ్యూజిక్ ఆస్వాదించవచ్చు.
గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.
OnePlus Buds Proలో మూడు మైక్రోఫోన్లు పొందుపరచబడి ఉన్నాయి. బండి మీద వెళ్ళేటప్పుడు, బయట గాలిలో కూడా ఫోన్ కాల్స్ మాట్లాడేటప్పుడు చుట్టూ గాలి శబ్ధం తగ్గి మాటలు స్పష్టంగా వినిపించడం కోసం నాయిస్ రిడక్షన్ మెకానికల్ డిజైన్‌ని ఇవి కలిగిఉంటాయి.
కనెక్టివిటీ
తాజా బ్లూటూత్ 5.2 టెక్నాలజీని ఇది కలిగి ఉంటుంది. ఏమాత్రం కనెక్షన్ డ్రాప్స్ వేధించవు. చాలా వేగంగా డివైజ్లకు కనెక్ట్ అవుతుంది. స్మార్ట్ ఫోన్ నుండి ఇయర్‌బడ్స్‌కి మధ్య చాలా దూరం కనెక్టివిటీ లభిస్తుంది.
OnePlus Buds Proలో మూడు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్స్ ఉంటాయి. Extreme, Faint, Smart మోడ్స్‌లో మీ అవసరాన్ని బట్టి ఎంత స్థాయిలో నాయిస్ తగ్గాలి అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ధరలో ఉన్న ఇతర ఇయర్ బడ్స్ తో పోలిస్తే ఇది అద్భుతమైన నాయిస్ క్యాన్సిలేషన్ అందిస్తోంది.
టచ్ కంట్రోల్స్ ద్వారా మ్యూజిక్ కంట్రోల్ మొదలుకొని, ANC కావాలా వద్దా అన్నది సెలెక్ట్ చేసుకోవడం, మ్యూజిక్ controls, కాల్స్ అటెండ్, రిజెస్ట్ చేసే ఫీచర్లు లభిస్తాయి. Zen Mode అనే ప్రత్యేకమైన సదుపాయం ద్వారా బాగా మానసికి ఒత్తిడిలో ఉన్నప్పుడు దాన్ని తగ్గించడం కోసం ఆహ్లాదకరమైన సంగీతాన్ని అందించడం వంటివి చేయవచ్చు.
ఇతర వివరాలు
IP55 రేటింగ్ కలిగి ఉండటం వలన డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్ సదుపాయం దీనికి ఉంటుంది. చార్జింగ్ కేస్ కూడా IPX4 వాటర్ రెసిస్టెన్స్ సదుపాయం కలిగి ఉంటుంది.
బ్యాటరీ లైఫ్
OnePlus Buds ఛార్జింగ్ కేస్‌తో కలిపి ఏకంగా 38 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తున్నాయి. నేరుగా ఇయర్ బడ్స్ ద్వారా ఏకంగా 7 గంటల బ్యాకప్ పొందొచ్చు. OnePlus Wrap ఛార్జ్ టెక్నాలజీ సపోర్ట్ చేయటం వలన పది నిమిషాలు ఛార్జింగ్ చేస్తే 10 గంటల బ్యాటరీ బ్యాకప్ పొందొచ్చు.
“కంప్యూటర్ ఎరా” అభిప్రాయం:
పది వేల రూపాయల ధర లో మంచి ఇయర్ బడ్స్ సూచించమని చాలామంది అడుగుతూ ఉంటారు. అలాంటి వారు నిక్షేపంగా తీసుకోగలిగిన ఇయర్‌బడ్స్ ఇవి.