సూపర్ ఫాస్ట్ Memory Card వచ్చేసింది..

sandisk

SanDisk ఓ సరికొత్త microSD కార్డ్‌ని కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. 256 GB స్టోరేజ్ కెపాసిటీ ఉన్న memory card ఇది. ఇప్పటికే 256 GB మెమరీ కార్డులు వాడకంలోకి వచ్చాయి కదా.. మరి దీనిలో ప్రత్యేకత ఏమిటి అన్న సందేహం కలుగుతోంది కదూ!

SanDisk 256 GB Extreme microSDXC UHS-I పేరిట SanDisk ఈ మెమరీ కార్డుని విడుదల చేసింది.  ప్రపంచంలో అత్యంత వేగవంతమైన memory cardగా దీన్ని పేర్కొనవచ్చు. కొత్తగా మెమరీ కార్డులను కొనుగోలు చేసేటప్పుడు మనం Class 10 మెమరీ కార్డులనే గొప్పగా భావిస్తూ ఉంటాం కదా!

Class 10 memory card సెకనుకి కేవలం 10 MB మొత్తంలో డేటాని ట్రాన్స్‌ఫర్ చెయ్యగలుగుతుంది. అంటే Class 10 మెమరీ కార్డుని మీ smartphone, camera లలో అమర్చుకుని వాడేటప్పుడు కేప్చర్ చేసే photos, videos, internal memory నుండి external memoryకి ట్రాన్స్‌ఫర్ చేసే ఫైళ్లు వంటివన్నీ కేవలం సెకనుకి 10 MB speedలోనే బదిలీ అవుతుంటాయి.

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

తాజాగా SanDisk విడుదల చేసిన ఈ SanDisk 256 GB Extreme microSDXC UHS-I కార్డ్ గరిష్టంగా సెకనుకి 100 MB స్పీడులో డేటాని ట్రాన్స్‌‌ఫర్ చెయ్యగలుగుతుంది. డేటాని రీడ్ చేసేటప్పుడు సెకనుకి 100 MB, మెమరీ కార్డులోకి డేటా రైట్ చేసేటప్పుడు సెకనుకి 90 MB మొత్తంలో స్పీడ్ లభిస్తుంది. SanDiskని హార్డ్ డిస్కుల తయారీ కంపెనీ Western Digital ఇటీవల కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే Western Digital సంస్థ 256GB SanDisk Ultra microSDXC UHS-I Premium Edition Qj`

గమనిక: Whatsappలో అన్ని లేటెస్ట్ Tech Updates కోసం https://chat.whatsapp.com/JMyfXBZdWl5BUR7SGHT3YY అనే గ్రూప్‌లో జాయిన్ అవండి. లేదా గమనిక: Telegramలో వాడేవారు లేటెస్ట్ Tech Updates కోసం https://t.me/sridharcera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

SanDiskని హార్డ్ డిస్కుల తయారీ కంపెనీ Western Digital ఇటీవల కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే Western Digital సంస్థ 256GB SanDisk Ultra microSDXC UHS-I Premium Edition పేరిట సెకనుకి 95 MB ట్రాన్స్‌ఫర్ రేటుని అందించే మెమరీ కార్డుని ఒక దానిని తక్కువ ధరకు ప్రకటించింది.

100 MBps స్పీడ్‌ని అందించే కార్డు 2016 చివరినాటికి రూ. 13,400కి అందుబాటులోకి రానుంది. అదే సెకనుకి 95 Mbps స్పీడ్‌ని అందించే మెమరీ కార్డు రూ. 10,000లకి వచ్చే నెలలో (ఆగస్ట్)లో అందుబాటులోకి రానుంది.

ఈ 256 GB మెమరీ కార్డుల ద్వారా స్మార్ట్‌ఫోన్ల ద్వారా 4K resolution కి చెందిన 14 గంటల వీడియోని రికార్డ్ చేసుకోవచ్చు. ఈ రెండు కార్డులు waterproof, temperature proof, shock proof, X-ray proof సామర్థ్యాలను కలిగి ఉంటాయి.

      Computer Era
      Logo