హిస్టరీలో చెత్త డిజైన్ కారణంగా అట్టర్‌ఫ్లాప్ అయిన 5 phoneలు ఇవి!

వివిధ phone కంపెనీలు ఎప్పటికప్పుడు లేటెస్ట్ డిజైన్లతో ఫోన్లను తయారు చేస్తూ ఉంటాయి. వేరే ఫోన్ తయారీ కంపెనీ అనుసరిస్తున్న డిజైన్ కాపీ చేయడం పెద్ద విషయం కాదు గానీ, ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా వినూత్నమైన డిజైన్ అందించాలన్న తాపత్రయం కొన్నిసార్లు విజయవంతమవుతుంది, మరికొన్నిసార్లు వైఫల్యం చెందుతుంది. Phone చరిత్రలో కొత్తగా ఏదో చేయాలని భావించి దారుణాతి దారుణంగా అట్టర్‌‌ఫ్లాప్ అయిన 5 phoneలకి సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం.

Ericsson Xelibri 4

Ericsson Xelibri 4

చూడటానికి ఎబ్బెట్టు డిజైన్ కలిగి ఉండటం వల్ల వైఫల్యం చెందిన ఫోన్ ఇది. Oval డిజైన్ తో ఉండటంతో చేతిలో పట్టుకోవడానికి కూడా అసౌకర్యంగా ఉంటుంది. 2003లో తయారుచేసిన ఫోన్ ఇది. అప్పటి ప్రమాణాల ప్రకారం మోనోక్రోమ్ డిస్ప్లే కలిగి ఉండేది.

Motorola Rockr

Motorola Rockr

సెప్టెంబర్ 2005లో, అంటే Apple iPhone మొట్టమొదటిసారిగా విడుదల కావడానికి రెండు సంవత్సరాల ముందు ఈ ఫోన్ విడుదల చేయబడింది. అప్పట్లోనే ఈ మోటరోలా ఫోన్లో iTunes సదుపాయం అంతర్గతంగా ఉండేది. దీనికంటే భిన్నమైన హెడ్ఫోన్ జాక్ ఉండటం వల్ల వినియోగదారులు వారి వద్ద ఉండే ఇతనే హెడ్ ఫోన్‌లను వాడగలిగే వారు కాదు. అలాగే USB 1.1 మాత్రమే ఉండటం వలన పాటలను ట్రాన్స్ఫర్ చేయడం కూడా చాలా నెమ్మదిగా ఉండేది. దాంతో వినియోగదారులు ఈ ఫోన్ పెద్దగా ఇష్టపడలేదు.

Blackberry Passport

Blackberry Passport

2014లో విడుదలైన స్మార్ట్ ఫోన్ ఇది. పట్టుకోడానికి చాలా వెడల్పుగా ఉండటం వలన ఈ ఫోన్ అంతగా పాపులర్ కాలేదు. చివరికి చాలామంది జేబులో కూడా ఇది ఇమిడిపోయేది కాదు. ఆ తర్వాత ఏ ఫోన్ కంపెనీ ఇంత వెడల్పాటి ఫోన్ తయారు చేయడానికి సాహసం చేయలేదు.

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

Nokia 7280

Nokia 7280

ఈ ఫోన్ చూడటానికి లిఫ్టిక్ ఆకారంలో ఉండేది. ఫ్యాషన్ పట్ల ఆసక్తి చూపించే వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని ఇది రూపొందించబడింది, అయితే ఇది కేవలం గిమ్మిక్ తపించి ఎలాంటి ప్రత్యేకమైన సదుపాయాలు ఉండేవి కాదు.

Toshiba 450

Toshiba 450

2008లో విడుదలైన ఫోన్ ఇది. జనాన్ని గందరగోళానికి గురి చేసే డిజైన్ దీనికే సొంతం. ఏ నెంబర్ ఎక్కడుందో గుర్తుంచుకోవడానికి కూడా చాలా కష్టపడాలి. ఇది కూడా ఏమాత్రం ఆదరణ చూరగొనలేకపోయింది.

Computer Era
Logo
Enable registration in settings - general