

10 వేల రూపాయలు లోపు కొత్తగా smartphone కొనాలనుకుంటున్నారా? ప్రస్తుతం భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న వివిధ మోడల్స్ గురించి ఇక్కడ చూద్దాం.
Poco C3
మీడియా టెక్ హీలియో G35 ప్రాసెసర్ ఆధారంగా పని చేస్తూ, గేమ్స్ ఆడుకోవడానికి హైపర్ ఇంజిన్ గేమ్ టెక్నాలజీ దీంట్లో పొందుపరచబడి ఉంటుంది. ఫోన్ వెనుక భాగంలో 13 మెగాపిక్సల్, 2, 2 మెగా పిక్సల్ రిసల్యూషన్ కలిగిన మూడు కెమెరాలు లభిస్తాయి. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ కలిగిన బ్యాటరీతో, 6.53 అంగుళాల హెచ్డీ ప్లస్ డిస్ప్లే ని ఇది కలిగి ఉంటుంది. 7499 రూపాయలకు లభించే ఈ ఫోన్లో 3gb ram, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. 4gb ram, 64 జీబీ స్టోరేజ్ మోడల్ కోసం 8999 రూపాయలు చెల్లించాలి. Flipkartలో ఈ లింక్ లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
Redmi 9 Prime
అన్ని విభాగాల్లో మెరుగైన పనితీరు కలిగిన ఫోన్ ఇది. 6.5 అంగుళాల ఫుల్ హెచ్డి ప్లస్ ఎల్సిడి డిస్ప్లే కలిగి ఉండి, mediatek helio G80 ప్రాసెసర్ ఆధారంగా పని చేస్తూ, ఫోన్ వెనుక భాగంలో 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 8 మెగా పిక్సల్ అల్ట్రా వేడి కెమెరా, 5 మెగా పిక్సల్ మాక్రో కెమెరా, 2 MP డెప్త్ సెన్సార్లను ఇది కలిగి ఉంటుంది. 5020 mAh కెపాసిటీ కలిగిన బ్యాటరీ ఉన్న ఈ ఫోన్, 4gb ram, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన మోడల్ ₹9999 కు, 4జిబి ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన మోడల్ 11999 రూపాయలకు ఈ లింకులో లభిస్తుంది.
Redmi 9i
ఫోన్ మీద సినిమాలు వీడియోలు చూసే వారి కోసం రూపొందించబడిన ఫోన్ ఇది. 6.53 అంగుళాల హెచ్డీ ప్లస్ IPS డిస్ప్లే కలిగి ఉండి, మీడియా టెక్ హీలియో G25 ప్రాసెసర్ ఆధారంగా ఇది పనిచేస్తుంది. PoweVR GE8320 GPU దీంట్లో లభిస్తుంది. 4జిబి ర్యామ్ కలిగి ఉండే ఈ ఫోన్లో వెనక భాగంలో 13 మెగా పిక్సల్ కెమెరా, ముందు భాగంలో 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 5000 mAh కెపాసిటీ కలిగిన బ్యాటరీతో 64gb స్టోరేజ్ కలిగిన మోడల్ 8299 రూపాయలకు, 128 జీబీ స్టోరేజ్ కలిగిన మోడల్ 9299 రూపాయలకు ఈ లింక్లో లభిస్తుంది.