16 వేలలో బెస్ట్ smartphone – Poco X3 డీటైల్డ్ రివ్యూ!

Poco X3 detailed review

చాలామందికి Poco సంస్థ విడుదల చేసిన మొట్టమొదటి Poco F1 ఫోన్ గుర్తుండే ఉంటుంది. అయితే కొద్దిగా ధర తగ్గించి, అందరికీ అందుబాటులో ఉండే విధంగా Poxo X3ని ఆ సంస్థ అందిస్తోంది. Flipkartలో ఈ లింక్‌లో రూ. 15,999కి ఈ ఫోన్ లభిస్తోంది.

Poco X3 డిజైన్

6.67 అంగుళాల భారీ స్క్రీన్ పరిమాణం కలిగి ఉండి, చాలా వేగవంతంగా ఉండే 120 Hz రిఫ్రెష్‌ రేట్‌తో ఈ ఫోన్ లభిస్తుంది. ఈ కారణం చేత గేమ్స్ ఆడే టప్పుడు, ఒక అప్లికేషన్ నుండి మరో అప్లికేషన్ కి మూవ్ అయ్యేటప్పుడు, ఫేస్బుక్ న్యూస్ ఫీడ్ వంటి వాటిని స్క్రోల్ చేసేటప్పుడూ చాలా స్మూత్ అనుభూతి లభిస్తుంది. స్క్రీన్ చుట్టూ అంచులు చాలా పలుచగా ఉంటాయి. 6000 mAh కెపాసిటీ కలిగిన బ్యాటరీ ఉండటంవల్ల ఫోన్ కొద్దిగా బరువు గా ఉంటుంది. అయితే అలవాటు పడితే అంత ఇబ్బంది అనిపించదు.

ఫ్రేమ్, బ్యాక్ పేనల్ ప్లాస్టిక్‌తో రూపొందించబడి ఉంటాయి. టీవీ, DTH వంటి వారిని కంట్రోల్ చేయడం కోసం IR సదుపాయం కూడా లభిస్తుంది. ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫోన్ కి పక్కన అమర్చబడి ఉంటుంది. మన అవసరాన్ని బట్టి 60 Hz, 120 Hz రిఫ్రెష్ రేట్‌లను మార్పిడి చేసుకోవచ్చు. అలాగే డిస్ప్లే ప్యానల్ 240 Hz టచ్ శాంప్లింగ్ రేట్ కలిగి ఉండటం వల్ల మన టచ్‌లకి ఫోన్ వేగంగా స్పందిస్తుంది.

Poco X3 పనితీరు

ఈ ఫోన్లో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్ ఉపయోగించబడింది. ఇది మెరుగైన పనితీరుని అందిస్తుంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, IP53 డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ సదుపాయాలను ఈ ఫోన్ కలిగి ఉంటుంది. ఎక్కువ పరిమాణం కలిగిన భారీ అప్లికేషన్స్ గానీ, గేమ్స్ గానీ ఆడేటప్పుడు ఏమాత్రం నెమ్మదించకుండా మంచి పనితీరుని కలిగి ఉంటోంది. Poco X3లో వీడియోలు చూసేటప్పుడు కూడా వ్యూయింగ్ యాంగిల్స్, దృశ్య నాణ్యత బాగుంటాయి. ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ రికగ్నిషన్ వేగంగా పనిచేస్తున్నాయి.

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

బ్యాటరీ లైఫ్

Poco X3 ఒక్కసారి చార్జింగ్ చేస్తే ఒక రోజు కంటే ఎక్కువ సమయం బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. 33W ఫాస్ట్ చార్జర్ ద్వారా 30 నిమిషాల్లో 57%, గంటలో 92 శాతం ఛార్జింగ్ పూర్తయింది.

కెమెరాలు

Poco X3 ఫోన్ వెనుక భాగంలో 64 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా తో పాటు 13 మెగా పిక్సల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా లభిస్తుంది. ఇది భారీగా 119 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూని అందించడం వల్ల ఎక్కువ ఏరియా కవరేజ్ వస్తుంది. వీటితోపాటు 2 మెగా పిక్సల్ డెప్త్ సెన్సార్, 2 MP మాక్రో కెమెరా ఉంటాయి. ఫోన్ ముందు భాగంలో 20 మెగాపిక్సల్ కెమెరా ఉంది. కెమెరా అప్లికేషన్ సులభంగా ఉండటంతో పాటు అనేక షూటింగ్ మోడ్స్ లభిస్తుంటాయి. అవసరానికి తగ్గట్టు మోడ్ మార్చుకోవచ్చు.

ఫోటోలు తీసే సమయంలో ఫోన్ మోడల్ కు సంబంధించిన వాటర్ మార్క్ వస్తుంది. కాబట్టి ఫోన్ కొన్న వెంటనే దాన్ని సెట్టింగ్స్లోకి వెళ్లి డిజేబుల్ చేసుకుంటే మంచిది. పగటి సమయంలో ఈ ఫోన్ ద్వారా తీయబడిన ఫోటోలు అద్భుతమైన డీటెయిల్ కలిగి ఉంటున్నాయి. దూరంగా ఉన్న టెక్స్ట్ కూడా స్పష్టంగా కనిపిస్తుంది. క్లోజప్ ఫోటోలు బ్యాగ్రౌండ్ నుండి స్పష్టంగా సెపరేషన్ చేయబడి డెప్త్ ఎఫెక్ట్ కలిగి ఉంటున్నాయి.

వెలుతురు తక్కువగా ఉన్నప్పుడు కొద్దిగా స్పష్టత లోపించినప్పటికీ, night modeని ఎనేబుల్ చేయడం ద్వారా మెరుగైన ఫోటోలు క్యాపిటల్ చేయొచ్చు. సెల్ఫీ కెమెరా కూడా మంచి ఫలితాలను అందిస్తోంది. ప్రైమరీ కెమెరా ద్వారా 4K క్వాలిటీ కలిగిన వీడియోలను, సెల్ఫీ కెమెరా ద్వారా 1080p క్వాలిటీ వీడియోలను షూట్ చేసుకోవచ్చు.

కొనొచ్చా లేదా?

Flipkartలో ఈ లింక్‌లో లభించే Poco X3 మెరుగైన పనితీరు, బ్యాటరీ బ్యాకప్ కలిగి ఉంటోంది. అలాగే భారీ స్క్రీన్ పరిమాణం కూడా దీంట్లో ప్రధానమైన ఆకర్షణ. 16 వేల రూపాయల ధరలో smartphone కొనుగోలు చేయాలనుకునే వారు రెండో ఆలోచన లేకుండా దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు.

Computer Era
Logo
Enable registration in settings - general