

మొట్ట మొదట ఒక విషయం గుర్తు పెట్టుకోండి. ధరకి తగ్గట్లే లాప్టాప్స్ పనితీరు ఉంటుంది. చిన్నస్థాయి అవసరాలకు 20 వేల రేంజ్లో లాప్టాప్ సెలెక్ట్ చేసుకోవాలనుకునే వారికి బెస్ట్ మోడల్స్ ఇవి!
టాప్ 1: Avita Essential refresh రూ. 21,299
తక్కువ స్థాయి ఆఫీస్ మరియు స్కూల్ వర్క్‌కి సరిపోయే లాప్టాప్ ఇది!
30, 40 వేల రూపాయల మోడల్స్‌లో కూడా ఎక్కువ ట్రాన్స్ఫర్ రేట్ అందించే SSD హార్డ్ డిస్క్ ఉండటంలేదు. అలాంటిది రూ. 21,299కి లభిస్తున్న ఈ లాప్టాప్లో 128GB SSD ఉండటం ప్రధానమైన ఆకర్షణ. SSD వల్ల ఆపరేటింగ్ సిస్టం, అప్లికేషన్స్ లోడింగ్ చాలా వేగంగా ఉంటాయి. అదనపు స్టోరేజ్ కోసం ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ కొనుగోలు చేయవచ్చు.
4GB RAM దీంట్లో అందించబడింది. ఇంటర్నెట్ బ్రౌజింగ్, ఆన్లైన్ క్లాసెస్, ఎమ్మెస్ ఆఫీస్ వంటి అవసరాలకు ఇది బేషుగ్గా సరిపోతుంది. ఆరు గంటలపాటు బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా ఇది పనిచేస్తుంది. 14 అంగుళాల Full HD స్క్రీన్ ఉంటుంది.