25 వేల లోపు బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్లు ఇవి!

25 వేల రూపాయల లోపు ధరలో 5G స్మార్ట్ ఫోన్ కొనాలనుకునేవారి కోసం అందుబాటులో ఉన్న అనేక బెస్ట్ మోడల్స్ వివరంగా ఇక్కడ చూద్దాం.

Mi 10i 5G

Overall Best Phone
రూ. 23,999
శక్తివంతమైన Snapdragon 750G ప్రాసెసర్
120Hz రిఫ్రెష్ రేట్, Full HD+ డిస్‌ప్లే
108MP క్వాడ్-కెమెరా సెటప్
Positive
  • ఆకర్షణీయంగా ఉండే డిజైన్
  • 6.67 అంగుళాల భారీ డిస్‌ప్లే
  • డ్యూయల్ స్టీరియో స్పీకర్లు
Negatives
  • 215 గ్రాముల బరువు

Mi 10i 5G మోడల్‌లో 6GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన మోడల్ ధర రూ. 21,999 ఉంటుంది. 8GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ మోడల్ రూ. 23,999 ఉంటుంది.

డిజైన్ మరియు బిల్డ్ క్వాలిటీ

చూడటానికి ఆకర్షణీయంగా ఉండే గ్లాస్ శాండ్విచ్ డిజైన్‌తో, మధ్యలో ప్లాస్టిక్ ఫ్రేమ్‌తో ఈ Mi 10i 5G మోడల్ రూపొందించబడింది. ఫోన్ ముందు వెనక గ్లాస్‌ని గొరిల్లా గ్లాస్ 5తో రక్షించటం జరిగింది. పవర్ బటన్ లోనే ఫింగర్ ప్రింట్ స్కానర్ నిక్షిప్తం చేయబడింది. చిన్న చేతులు ఉన్నవారు కూడా సులభంగా యాక్సెస్ చేయగలిగే విధంగా ఇది అమర్చబడింది.

Mi 10i 5Gలో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు అందించడం ప్రత్యేకమైన ఆకర్షణ. అధికశాతం ఫోన్ తయారీ కంపెనీలు ధర తగ్గించడం కోసం ఆడియో విషయంలో కాంప్రమైజ్ అయితే Mi 10i 5Gలో ఈ తరహా నాణ్యమైన స్పీకర్లు లభించటం సంతోషించదగ్గ విషయం.

డిస్ప్లే

Mi 10i 5G స్మార్ట్‌ఫోన్లో 6.67 అంగుళాల Full HD+ 120 Hz రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ప్లే అందించబడింది. రిఫ్రెష్ రేట్ ఎక్కువ లభించటం వల్ల గ్రాఫిక్స్ చాలా స్మూత్ గా ఉంటాయి. ఫోన్ వాడేటప్పుడు యానిమేషన్లు, ట్రాన్షిషన్ ఎఫెక్టులు అద్భుతంగా ఉంటాయి. అలాగే స్క్రీన్ మీద రంగులు కూడా సహజ సిద్ధంగా లభిస్తాయి. 20:9 aspect ratio కలిగిన ఈ ఫోన్ ద్వారా 395ppi పిక్సెల్ డెన్సిటీ లభిస్తుంది. గరిష్టంగా 450 nits వరకూ బ్రైట్నెస్ లభించటం వలన నేరుగా సూర్యకాంతి కింద కూడా ఫోన్ స్క్రీన్ మీద అక్షరాలు స్పష్టంగా కనిపిస్తాయి.

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

ప్రాసెసర్, పనితీరు

Mi 10i 5Gలో శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగాన్ 750G 5G ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఉపయోగించబడింది. 5G అందుబాటులోకి వచ్చినప్పుడు కొత్తగా మళ్ళీ ఫోన్ కొనుక్కోవాల్సిన పని లేకుండా 5G సదుపాయాన్ని కలిగివున్న మోడల్ ఇది. గేమింగ్, మల్టీటాస్కింగ్ కోసం, రోజువారీ అన్నిరకాల అవసరాలకు ఈ ఫోన్ అనువుగా ఉంటుంది.

కెమెరా

Mi 10i 5Gలో వెనక భాగంలో నాలుగు కెమెరాలు ఉంటాయి. 108 MP ప్రైమరీ కెమెరా తో పాటు, 8 MP ultra wide యాంగిల్ కెమెరా 120 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూని మనకు అందిస్తుంది. అలాగే 2 MP మాక్రో కెమెరా, 2 MP డెప్త్ సెన్సార్ కూడా లభిస్తాయి. వెనక కెమెరా ద్వారా 4K క్వాలిటీ కలిగిన వీడియోలను రికార్డ్ చేయవచ్చు. ఫోన్ ముందు భాగంలో 16 MP వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ లైఫ్

4820 mAh కెపాసిటీ కలిగిన బ్యాటరీ ఈ ఫోన్ లో లభిస్తుంది. 60 Hz రిఫ్రెష్ రేట్‌లో ఫోన్‌ని సెట్ చేసినప్పుడు ఒక్కసారి చార్జింగ్ చేస్తే ఒకరోజు పూర్తిగా బ్యాటరీ వస్తుంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్ ద్వారా గంటా ఐదు నిముషాల్లో 0 నుండి 100 శాతం వరకూ ఛార్జింగ్ పొందొచ్చు.

ఓపీనియన్

Mi 10i 5G తక్కువ ధరలో లభిస్తున్న అద్భుతమైన 5G స్మార్ట్‌ఫోన్ అని చెప్పుకోవచ్చు. అన్ని రకాల శక్తివంతమైన సదుపాయాలు దీంట్లో ఉన్నాయి.

Oppo F19 Pro+ 5G

Runner-up Phone
రూ. 25,990
180Hz వరకూ టచ్ శాంప్లింగ్ రేట్ (గమనిక: ఇది రిఫ్రెష్ రేట్ కాదు)
మీడియాటెక్ డైమెన్సిటీ 800U 5G చిప్‌సెట్
అద్భుతమైన Super AMOLED డిస్‌ప్లే
Positive
  • AI నైట్ మోడ్ ద్వారా నాణ్యమైన వీడియోలు
  • వేగంగా రెస్పాండ్ అయ్యే Color OS 11.1
Negatives
  • 60 Hz రిఫ్రెష్ రేట్ మాత్రమే కలిగి ఉండడం

Oppo F19 Pro+ 5G 25 వేల రూపాయల ధరలో లభిస్తున్న మరో బడ్జెట్ 5G ఫోన్. రెండో ఛాయిస్‌గా దీన్ని నిరభ్యంతరంగా ఎంపిక చేసుకోవచ్చు.

డిజైన్ మరియు బిల్డ్ క్వాలిటీ

ఈ ఫోన్ డిజైన్ చాలా ఆకర్షణీయంగా రూపొందించబడింది. మిర్రర్ బ్యాక్, భిన్నమైన కెమెరా మాడ్యుల్ డిజైన్ ఫోన్ వెనుక భాగంలో లభిస్తుంది. 173 గ్రాముల బరువును మాత్రమే కలిగి ఉండటం వలన చేతిలో పట్టుకోవడానికి సౌకర్యవంతంగా ఉంటుంది. మిగతా ఫోన్లకి భిన్నంగా ఎడమ చేతి వైపు వేల్యూమ్ బటన్లు, కుడి చేతి వైపు పవర్ బటన్ ఉంటాయి. ఇది AMOLED డిస్ప్లే కావటం వలన స్క్రీన్ లోనే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది.

డిస్ప్లే

6.42 అంగుళాల Full HD+ Super AMOLED డిస్ప్లే ఈ ఫోన్లో పొందుపరచబడింది. 409 ppi పిక్సెల్ డెన్సిటీ దీని ద్వారా లభిస్తుంది. గరిష్టంగా 800 nits బ్రైట్నెస్ అందించడం వల్ల, అవసరానికంటే ఎక్కువ బ్రైట్నెస్ ఈ ఫోన్ ద్వారా పొందొచ్చు. అయితే కేవలం 60 Hz రిఫ్రెష్ రేట్ మాత్రమే ఉండడం కొద్దిగా నిరుత్సాహ పరిచే అంశం. అయినప్పటికీ 180 Hz టచ్ శాంప్లింగ్ రేట్ ఉండడం వల్ల గేమ్స్ ఆడేటప్పుడు వేలితో టాప్ చేసే రెస్పాన్స్ వేగంగా ఉంటుంది.

ప్రాసెసర్, పనితీరు

మీడియాటెక్ డైమెన్సిటీ 800U 5G ఆక్టాకోర్ ప్రాసెసర్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. 8GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఇది కలిగి ఉంటుంది. రోజువారీ అవసరాలకు, మల్టీటాస్కింగ్ కోసం అన్ని రకాలుగా స్మూత్ గా ఉండే పనితీరు ఈ ఫోన్ ద్వారా పొందొచ్చు. Android 11 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే Color OS 11.1ని ఇది కలిగి ఉంటుంది.

కెమెరా

Oppo F19Pro+లో ఫోన్ వెనుక భాగంలో నాలుగు కెమెరాలు ఉంటాయి. 48 MP ప్రైమరీ కెమెరా తో పాటు, 8 MP అల్ట్రావైడ్ యాంగిల్ కెెమెరా, 2 MP macro, 2 MP depth sensorలు లభిస్తున్నాయి. రాత్రి సమయంలో మెరుగైన వీడియోలు రికార్డ్ చేసుకునే విధంగా AI night mode ఉపయోగపడుతుంది. ఒకేసారి ముందు వెనక కెమెరాల ద్వారా రికార్డ్ చేసుకునే అవకాశం కూడా ఈ ఫోన్ లో లభిస్తుంది.

బ్యాటరీ లైఫ్

Oppo F19 Pro+లో 4310 mAh బ్యాటరీ లభిస్తుంది. ఇది ఒక రోజు బ్యాటరీ బ్యాకప్ అందించగలుగుతుంది. 50W ఫాస్ట్ చార్జర్ ద్వారా 0 నుండి 100 శాతానికి కేవలం గంట లో ఛార్జింగ్ చేసుకోవచ్చు.

ఒపీనియన్

ఈ ధరలో అవసరమైన అన్ని సదుపాయాలు కలిగిన మోడల్‌గా ఈ Oppo F19 Pro+ని భావించవచ్చు.

Realme 8 5G

బడ్జెట్ ఆల్ రౌండర్
రూ. 16,999
5Gతో కూడిన మీడియాటెక్ ప్రాసెసర్
Realme UI 2.0 ఆధారంగా పనిచేసే ఆండ్రాయిడ్ 11 ఓయస్
90 Hz Full HD+ డిస్‌ప్లే
Positive
  • తక్కువ ధర కలిగి ఉండడం
  • 6.5 అంగుళాల డిస్‌ప్లే
Negatives
  • ఫోన్ వెనుక వేలిముద్రలు పేరుకుపోతుంటాయి

ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న వాటిలో తక్కువ ధరలో లభిస్తున్న 5G phone ఇది.

డిజైన్ మరియు బిల్డ్ క్వాలిటీ

ప్రీమియం Vivo ఫోన్లని పోలి ఉండేలా దీని డిజైన్ ఉంటుంది. బ్యాక్ ప్యానల్, మిడిల్ ఫ్రేమ్‌ని ప్లాస్టిక్‌తో రూపొందించారు. ఫోన్ వెనుక భాగంలో కనిపించే గ్లాసీ బ్యాక్ ప్యానల్ మీద చాలా సులభంగా వేలిముద్రలు పేరుకుపోతుంటాయి.

USB-C పోర్ట్‌ని ఈ ఫోన్ కలిగి ఉంటుంది. ఫోన్ అడుగు భాగంలో ఆడియో జాక్, స్పీకర్ గ్రిల్ లభిస్తాయి. పవర్ బటన్ లోనే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది.

డిస్ప్లే

Realme 8 5Gలో 6.5 అంగుళాల Full HD+ 90 Hz రిఫ్రెష్ రేట్ కలిగిన డిస్ప్లే అందించబడింది. రిఫ్రెష్ రేట్ ఎక్కువ ఉండడం వల్ల స్క్రీన్ మీద యానిమేషన్లు స్మూత్ గా ఉంటాయి. ఈ ఫోన్ మెరుగైన కలర్ reproduction అందిస్తుంది.

ప్రాసెసర్, పనితీరు

Realme 8 5G ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్ లభిస్తుంది. 5G సదుపాయాన్ని అందించే ప్రాసెసర్ ఇది. మల్టీటాస్కింగ్ మరియు గేమ్స్ ఆడే టప్పుడు ఫోన్ ఏమాత్రం వేడెక్కకుండా మెరుగైన పనితీరు కలిగిఉంటుంది. 8GB ర్యామ్ ఉండడం వల్ల మల్టీటాస్కింగ్ కి ఈ ఫోన్ అనువుగా ఉంటుంది. 128GB ఇంటర్నల్ స్టోరేజ్ దీంట్లో లభిస్తుంది.

కెమెరా

ఫోన్ వెనుక భాగంలో 48 megapixel ప్రైమరీ కెమెరా తో పాటు 2 MP డెప్త్ సెన్సార్, 2 MP మాక్రో సెన్సార్‌లు ఈ ఫోన్లో ఉంటాయి. పగటి సమయంలో ప్రైమరీ కెమెరా ద్వారా మెరుగైన ఫోటోలు లభిస్తున్నాయి. డెప్త్ కెమెరా ద్వారా పోర్ట్రయిట్ ఫొటోలు తీసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవుతుంది. మాక్రో కెమెరా ఓ మాదిరి ఫోటోలను మాత్రమే అందించగలుగుతుంది. ఫోన్ ముందు భాగంలో 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ లైఫ్

5000 mAh కెపాసిటీ కలిగిన బ్యాటరీ ఈ ఫోన్ ద్వారా లభిస్తుంది. ఒకరోజు పూర్తిగా బ్యాటరీ బ్యాకప్ పొందొచ్చు. 18W ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 0 నుండి 100 ఛార్జింగ్ చేసుకోవటానికి రెండు గంటలకు పైగా సమయం పడుతుంది.

ఒపీనియన్

అన్నిటి కంటే తక్కువ ధరలో 5G ఫోన్ కొనాలనుకునేవారు ఈ మోడల్ ఎంపిక చేసుకోవచ్చు.

Computer Era
Logo
Enable registration in settings - general