30 వేలలో smartphone కొనాలంటే.. 7 బెస్ట్ మోడల్స్ ఇవి!

best smartphones under Rs. 30000

30 వేల రూపాయల లోపు smartphone కొనుగోలు చేయాలనుకునే వారు ఖచ్చితంగా మెరుగైన స్పెసిఫికేషన్స్ ఆశిస్తారు. అలాంటివారికి అందుబాటులో ఉన్న best smartphones గురించి ఇప్పుడు చూద్దాం.

Samsung Galaxy M31s

6.5 అంగుళాల Full HD+ డిస్ప్లేతో, 64 megapixel ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రా వైడ్ కెమెరా, 5 MP డెప్త్ సెన్సార్, 5 MP మాక్రో కెమెరా, ఫోన్ ముందు భాగంలో 32 megapixel సెల్ఫీ కెమెరా దీంట్లో లభిస్తాయి. 8gb ram, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటాయి. 6000 mAh కెపాసిటీ కలిగిన బ్యాటరీతో 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ దీంట్లో ఉంటుంది. సాంసంగ్ Exynos 9611 ప్రాసెసర్ ఆధారంగా పనిచేసే ఈ ఫోన్‌ని 21,499 రూపాయలకు Amazonలో ఈ లింకులో కొనుగోలు చేయవచ్చు.

Realme X2 Pro

6.5 అంగుళాల Full HD+ డిస్ప్లేతో, అతి అద్భుతమైన దృశ్య నాణ్యత అందించే AMOLED డిస్‌ప్లే ప్యానల్ కలిగి ఉండి ఫోన్ వెనుక భాగంలో 24 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 13 మెగా పిక్సల్ ultrawide కెమెరా, 8 మరియు 2 మెగాపిక్సెల్ మరో రెండు కెమెరాలు కలిగి ఉండి 8GB RAMని ఈ ఫోన్ అందిస్తుంది. ఫోన్ ముందు భాగంలో 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 855+ ప్రాసెసర్ దీంట్లో ఉపయోగించబడింది. 4000 mAh కెపాసిటీ కలిగిన బ్యాటరీ ఉండే ఈ ఫోన్‌ని Amazonలో ఈ లింకులో 31890కి కొనుగోలు చేయవచ్చు.

OnePlus Nord

6.44 అంగుళాల Full HD+ డిస్ప్లేతో, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 765G రస్సెల్ ఆధారంగా పనిచేసే ఈ ఫోన్‌‌లో 48MP ప్రైమరీ కెమెరా తో పాటు, 8 MP Ultra Wide కెమెరా, 5, 2 MP మరో రెండు కెమెరాలు ఫోన్ వెనుక భాగంలో ఉంటాయి. సెల్ఫీల కోసం 32 మెగాపిక్సల్ కెమెరా లభిస్తుంది. 4115 mAh కెపాసిటీ కలిగిన బ్యాటరీతో ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా ఈ ఫోన్ పని చేస్తుంది. 8GB RAM దీంట్లో ఉంటుంది. Amazonలో ఈ లింక్ నుండి ఈ phoneని 27,999 రూపాయలకి కొనుగోలు చేయవచ్చు.

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

Redmi K20 Pro

6.39 అంగుళాల Full HD+ రిసల్యూషన్ కలిగి ఉండి, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 855 processor ఆధారంగా ఈ ఫోన్ పని చేస్తుంది. ఫోన్ వెనుక భాగంలో 48 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 13 మెగా పిక్సల్ ultrawide కెమెరి, 8 MP మరో కెమెరా, ఫోన్ ముందు భాగంలో సెల్ఫీల కోసం 20 మెగా పిక్సల్ కెమెరా దీంట్లో లభిస్తాయి. 4000 mAh కెపాసిటీ కలిగిన బ్యాటరీ ఉండే ఈ ఫోన్లో 6GB RAM, 128 GB స్టోరేజ్ ఉంటుంది. Amazonలో ఈ లింక్ నుండి 22,999 రూపాయలకి దీన్ని కొనుగోలు చేయొచ్చు.

Oppo F17 Pro

6.43 అంగుళాల స్క్రీన్ పరిమాణంతో, 48 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మరియు 2 మెగా పిక్సల్ మరో రెండు కెమెరాలు, ఫోన్ ముందు భాగంలో 16 మరియు 2 మెగాపిక్సల్ రెండు కెమెరాలు ఈ ఫోన్ లో లభిస్తాయి. 8 GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ దీంట్లో ఉంటుంది. 4015 mAh కెపాసిటీ కలిగిన బ్యాటరీ, 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటాయి. మీడియా టెక్ హీలియో P95 ప్రాసెసర్ ఆధారంగా ఇది పనిచేస్తుంది. 22,990 రూపాయలకి ఈ ఫోన్‌ని ఈ లింకులో కొనుగోలు చేయవచ్చు.

Vivo V19

6.44 అంగుళాల స్క్రీన్ పరిమాణం తో, ఫోన్ వెనుక భాగంలో 48 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 8 మెగా పిక్సల్ ultrawide కెమెరా, 2 మరియు 2 మెగాపిక్సల్ మరో రెండు కెమెరాలు, ఫోన్ ముందు భాగంలో 32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా దీంట్లో ఉంటాయి. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 675 processor ఆధారంగా ఈ ఫోన్ పని చేస్తుంది. 8gb ram, 4500 mAh కెపాసిటీ కలిగిన బ్యాటరీ దీంట్లో ఉంటాయి. Amazonలో ఈ లింక్ నుండి 24,990 రూపాయలకి దీన్ని కొనుగోలు చేయొచ్చు.

Realme X3

6.6 అంగుళాల Full HD+ రిజల్యూషన్‌తో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 855+ ప్రాసెస్ అధారంగా పనిచేస్తూ, 120 Hz రిఫ్రెష్ రేట్ అందించే LCD ప్యానల్‌ని ఈ ఫోన్ కలిగి ఉంటుంది. ఫోన్ వెనుక భాగంలో 64, 12, 8, 2 మెగా పిక్సెల్ నాలుగు కెమెరాలు, ఫోన్ ముందు భాగంలో 16 మరియు 8 మెగా పిక్సల్ మరో రెండు కెమెరాలు లభిస్తాయి. 6GB RAM ఈ ఫోన్లో పొందుపరచబడి ఉంటుంది. 4200 mAh కెపాసిటీ కలిగిన బ్యాటరీ ఉండే ఈ phoneని Flipkartలో ఈ లింకులో కొనుగోలు చేయవచ్చు.

Computer Era
Logo
Enable registration in settings - general