

ఓ మంచి లాప్ టాప్ సజెస్ట్ చేయండి అని ఎవరైనా అడిగినప్పుడు.. వారి బడ్జెట్ 40-45 వేలు అయితే ఇంత కన్నా బెటర్ మోడల్ కనిపించదు.
Lenovo IdeaPad Slim 3 ప్రధానంగా 2021లో విడుదల చేయబడిన మోడల్. అంతేకాదు, ఎన్నికల సంస్థ ఇటీవల విడుదల చేసిన లేటెస్ట్ జనరేషన్ 11th Genకి చెందిన Core i3 ప్రాసెసర్ కలిగి ఉంటుంది.
మల్టీటాస్కింగ్ కోసం పెద్ద మొత్తంలో RAM కావాలి కాబట్టి 8GB RAM దీంట్లో ఉంది. 256GB SSD అందించబడింది. కేవలం 256GBనేనా, 1TB హార్డ్ డిస్క్ ఉంటే బాగుండేది అని భావించేవారు ఒకటి గుర్తు పెట్టుకోవాలి. విండోస్, అందులో మనం ఇన్స్టాల్ చేసే ప్రోగ్రాములు వేగంగా లోడ్ అవడానికే SSD ఉంటే సరిపోతుంది.
అదనంగా మీకు ఇతర అవసరాలు ఉంటే ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ గానీ, గూగుల్ డ్రైవ్ వంటి క్లౌడ్ స్టోరేజ్ గానీ ఉపయోగించుకోవచ్చు.