500 నుండి 5000 వేల లోపు ఉన్న ఈ gadgets ఉంటే మీ ఇల్లు Smart Home అయిపోతుంది!

smart home gadgets on Amazon and Flipkart

ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా Smart Home gadgets వినియోగం బాగా పెరిగింది. కేవలం 500 నుండి 5000 రూపాయల మధ్య ఖర్చు పెట్టటం ద్వారా అనేక రకాల Smart Home gadgetsని మీరు సొంతం చేసుకోవచ్చు. అవేంటో ఇక్కడ చూద్ధాం.

Mi Motion Activated Night Light 2 ధర కేవలం 599 రూపాయలు. ఇది తనకు సమీపంగా 120 డిగ్రీల రేంజ్‌లో మనుషుల కదలికను గుర్తించినట్లయితే దానంతట అదే వెలుగుతుంది. ఆ తర్వాత ఆగిపోతుంది. మెట్లు, కారిడార్ వంటి ప్రదేశాల్లో అమర్చుకోవడానికి ఇది అనుకూలం. Flipkartలో ఈ లింక్ నుండి దీన్ని కొనుగోలు చేయవచ్చు.

TP-Link HS100 WiFi- Smart Plugని 1,599 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. ఈ ప్లగ్‌కి కనెక్ట్ చేయబడిన డివైజ్లను అమెజాన్ అలెక్స వాయిస్ అసిస్టెంట్ అధారంగా కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే ఒక నిర్దిష్టమైన సమయంలో ఆయా డివైజ్ను ఆన్ ఆఫ్ అయ్యే విధంగా చేసుకోవచ్చు. ఈ లింకులో ఈ స్మార్ట్ ప్లగ్ కొనుగోలు చేయవచ్చు.

Helea 10A Wi-Fi Smart Plusని కేవలం 890 రూపాయలకు Amazonలో ఈ లింక్‌లో కొనుగోలు చేయొచ్చు. దీనికి కనెక్ట్ చేయబడి ఉన్న డివైజ్లని ప్రపంచంలో ఎక్కడి నుండైనా కంట్రోల్ చేసుకోవచ్చు. అమెజాన్ అలెక్స, గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ దీంట్లో ఉంటుంది. ఒక నిర్దిష్టమైన సమయంలో కనెక్ట్ చేయబడిన డివైజ్‌లు ఆటోమేటిక్గా ఆన్ లేదా ఆఫ్ చేయబడే విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు.

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

Gadget Bite ఆటోమేటిక్ సోప్ డిస్‌పెన్సర్‌ని 1,499 రూపాయలకు కొనుగోలు చేయొచ్చు. స్మార్ట్ ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్ టెక్నాలజీ ఆధారంగా పని చేస్తూ చేతిని పెట్టిన వెంటనే ఆటోమేటిక్‌గా సోప్‌ని బయటకు అందించే డివైజ్ ఇది. Amazonలో ఈ లింక్ లో దీన్ని కొనుగోలు చేయొచ్చు.

మీ ఇంటి సెక్యూరిటీ కోసం ఖరీదైన సీసీ కెమెరాలు కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా వైఫై ఆధారంగా పనిచేసే CP Plus హోమ్ సెక్యూరిటీ కెమెరాను 2,163 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. ఇది 360 డిగ్రీల కోణంలో ఉన్న దృశ్యాలను క్యాప్చర్ చేస్తూ, Full HD వీడియో క్వాలిటీ అందిస్తుంది. గరిష్ఠంగా 64gb మెమరీ కార్డు సపోర్ట్ దీంట్లో ఉంటుంది. Amazonలో ఈ లింక్ లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.

Smarteefi 8 module square smart switch board స్విచ్ బోర్డు ద్వారా మొత్తం ఆరు స్మార్ట్ స్విచ్‌లు, రెండు స్మార్ట్ ప్లగ్‌లు లభిస్తాయి. మామూలుగా వాడే స్విచ్ బోర్డు కి ప్రత్యామ్నాయంగా దీన్ని వాడొచ్చు. ప్రత్యేకమైన మొబైల్ అప్లికేషన్ ద్వారా దీనిని వైఫై ఆధారంగా కంట్రోల్ చేసుకోవచ్చు. Amazonలో దీన్ని 4,799 రూపాయలకు ఈ లింక్ లో కొనుగోలు చేయవచ్చు.

Computer Era
Logo
Enable registration in settings - general