547.5GB డేటా తో కొత్త ప్లాన్ తీసుకొచ్చిన Vodafone

Vodafone 547.5GB new tariff plan

ఇటీవల టెలికాం కంపెనీలు సుదీర్ఘ కాలం వ్యాలిడిటీ కలిగిన కొత్త ప్లాన్ లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. అందులో భాగంగా ఇటీవల Airtel  365 రోజులు వ్యాలిడిటీ కలిగిన 1699 రూపాయల విలువ కలిగిన ప్లాన్ ప్రవేశపెట్టగా, అదే కోవలో తాజాగా Vodafone మరో ప్లాన్ తీసుకొచ్చింది.

1,999 రూపాయల విలువ కలిగిన ఈ ప్లాన్ 365 రోజులు వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. అంతేకాదు,  రోజుకి 1.5GB చొప్పున మొబైల్ డేటాతో సంవత్సరం మొత్తానికి కలిపి 547.5GB మొబైల్ డేటాను కలిగి ఉంటుంది. అయితే ప్రస్తుతానికి కేరళ టెలికం సర్కిల్లో మాత్రమే ఇది అందుబాటులోకి వచ్చింది. అతి త్వరలో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది రాబోతోంది.

కేవలం మొబైల్ డేటా మాత్రమే కాదు, సంవత్సరకాలం పాటు అపరిమితమైన లోకల్,  ఎస్.టి.డి, రోమింగ్ కాల్స్ ఈ ప్లాన్ ద్వారా చేసుకోవచ్చు. వాస్తవానికి గతంలో వోడాఫోన్  కాల్స్ విషయంలో పరిమితి ఉండేది. కొన్ని నిర్దిష్టమైన కాల్స్ రోజు మొత్తం మీద చేసుకున్న తర్వాత, అదనంగా కాల్స్ పర్మిట్  అయ్యేవి కాదు. అయితే ఇటీవల ఈ FUP లిమిట్‌ని వోడాఫోన్ సంస్థ తొలగించిన విషయం చాలామందికి తెలిసిందే. ఇకపోతే ఈ ప్లాన్లో రోజుకి 100 చొప్పున ఉచిత ఎస్ఎంఎస్లు సంవత్సరం పాటు అందించబడతాయి.

ఇదిలా ఉంటే, గతంలో 365 రోజులు వ్యాలిడిటీతో  రోజుకి 1GB చొప్పున మొబైల్ డేటా అందించే ప్లాన్ 1499 రూపాయలు విలువ కలిగి ఉండేది. అయితే వోడాఫోన్ దాని ధరను  తాజాగా పెంచింది. ప్రస్తుతం దీని కోసం 1699 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. ఏదేమైనప్పటికీ, చీటికీ మాటికీ రీచార్జి చేసుకోవడం ఇబ్బందిగా భావించే వారి కోసం ఇలా లాంగ్ వాలిడిటీ కలిగిన ప్లాన్లు చాలా ఉపయుక్తంగా ఉంటాయి.

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

గమనిక: Whatsappలో అన్ని లేటెస్ట్ Tech Updates కోసం https://chat.whatsapp.com/JMyfXBZdWl5BUR7SGHT3YY అనే గ్రూప్‌లో జాయిన్ అవండి. లేదా గమనిక: Telegramలో వాడేవారు లేటెస్ట్ Tech Updates కోసం https://t.me/sridharcera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

Tags:

Computer Era
Logo