

Gmail వంటి ఈ మెయిల్ సర్వీస్‌లు కేవలం 25mb వరకు మాత్రమే మెయిల్ అటాచ్మెంట్ పంపడానికి అవకాశం కల్పిస్తాయి. అయితే గూగుల్ డ్రైవ్ వాడటం ద్వారా, భారీ పరిమాణం కలిగిన ఫైళ్లను send చేసే అవకాశం ఉన్నప్పటికీ, అది మీకు లభిస్తున్న ఉచిత గూగుల్ స్టోరేజ్‌ని బట్టి ఆధారపడి ఉంటుంది.
ఈ నేపథ్యంలో ఇకమీదట భారీ పరిమాణం కలిగిన ఫైళ్లను ఇతరులకు పంపించటం విషయంలో ఎలాంటి ఇబ్బంది పడాల్సిన పనిలేదు. గరిష్టంగా 5 జీబీ వరకూ అభిమానం కలిగిన ఫైళ్లను మీ స్నేహితులకు పంపడం కోసం SendGB అనే ఉచిత సర్వీస్ లభిస్తోంది. ఇది పూర్తిగా ఉచితం. మీరు చేయవలసిందల్లా భారీ పరిమాణం కలిగిన ఫైళ్లను అప్లోడ్ చేయగలిగిన వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్షన్ కలిగి ఉండటమే.
ఒక్కసారి ఈ వెబ్సైట్ లో పెద్ద ఫైళ్లను అప్ లోడ్ చేసిన తర్వాత, వెంటనే స్క్రీన్ మీద వచ్చే ఇంటర్ఫేస్ ద్వారా, మీరు ఎవరికి అయితే ఆ ఫైల్ పంపాలనుకుంటున్నారో, ఆ వ్యక్తి మెయిల్ ఐడిని టైప్ చేసి, దాంతోపాటు కావాలంటే ఒక మెసేజ్ కూడా కంపోజ్ చేసి మెయిల్ పంపించవచ్చు. ఫైల్ యొక్క పరిమాణాన్ని బట్టి ఏడు రోజుల నుండి 90 రోజుల వరకు అది సర్వర్‌లో జాగ్రత్తగా భద్రపరచబడుతుంది.
ఇక్కడ అన్నిటికంటే గొప్ప విషయం.. రోజువారి ఎలాంటి పరిమితులు లేకుండా మీరు ఎన్ని ఫైల్స్ కావాలంటే అన్ని ఫైల్స్ ఈ సర్వీసు ద్వారా మీకు కావలసిన వ్యక్తులకు షేర్ చేసుకోవచ్చు. అలాగే మీరు కోరుకుంటే గనుక, అవతలి వ్యక్తి డౌన్లోడ్ చేసుకున్న వెంటనే ఆటోమేటిక్గా సంబంధిత ఫైల్ తొలగించబడే విధంగా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇప్పటివరకు ఈ సర్వీస్ లో ఎలాంటి పరిమితులు లేవు కాబట్టి నిరభ్యంతరంగా దీన్ని మీ రోజువారీ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు.