
పది వేల రూపాయల లోపు ధరలో అనేక ఫోన్స్ అందుబాటులో ఉన్నప్పటికీ అందులో మెరుగైన పనితీరు కలిగిన మోడల్స్ కొద్దే ఉంటాయి.
అందులో తాజాగా రూ. 7,999కి రిలీజైన Techno Spark 8 అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చాలా కాలంగా ఈ సంస్థ వేల్యూ ఫర్ మనీ ఫోన్లని విడుదల చేస్తూ వస్తోంది.
డిజైన్
మెటల్ కోడింగ్ డిజైన్ వలన ఇది చూడడానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ధరకి మించిన లుక్ దీనికి ఉంటంది. Notch రూపంలో స్క్రీన్ పై భాగంలో సెల్ఫీ కెమెరా ఉంటుంది.
డిస్ప్లే
6.5 అంగుళాల హెచ్డీ ప్లస్ డిస్‌ప్లేని ఈ ఫోన్ కలిగి ఉంటుంది. మూడువైపులా సన్నని అంచులు, కింది భాగంలో కొద్దిగా మందపాటి bezel ఉంటాయి. 6.5 అంగుళాల స్క్రీన్ ఉండటంవల్ల వీడియోలు, సినిమాలు చూసేటప్పుడు, పుస్తకాలు చదివేటప్పుడు సౌకర్యవంతంగా ఉంటుంది.