80 వేల Samsung Galaxy S20+ ఇప్పుడు 35,198కే ఇలా పొందొచ్చు!

How to get Samsung Galaxy S20+ for 35000

Samsung సంస్థ ఈ ఈ ఏడాది ప్రారంభంలో విడుదల చేసిన శక్తివంతమైన flagship ఫోన్ Samsung Galaxy S20+ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఫోన్ ప్రస్తుతం భారతీయ మార్కెట్లో 77,999 రూపాయలకు కొనుగోలు చేయవలసి ఉంటుంది. అయితే దీని మీద భారీగా డిస్కౌంట్ లభించబోతోంది.

Flipkartలో అక్టోబర్ 16వ తేదీ నుండి ప్రారంభం కాబోతున్న Big Billion Days సేల్‌లో 77,999 రూపాయల విలువ కలిగిన ఈ ఫోన్ కేవలం 49,999 రూపాయలకు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. అయితే అప్పటికి ఇంకా ధర తగ్గించుకునే వీలు ఈ పద్ధతి ద్వారా ఉంది. Flipkart తాజాగా తీసుకొస్తున్న Samsung Smart Upgrade ఆఫర్ సెలెక్ట్ చేసుకుని, అదనంగా మరో 15 వేల రూపాయల వరకు తగ్గింపు పొందొచ్చు. అంటే 77,999 రూపాయల విలువ కలిగిన ఫోన్ని కేవలం 35,198 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు.

Samsung Smart Upgrade Offer గురించి ఇప్పటికే మన “కంప్యూటర్ ఎరా”లో వివరంగా రాసిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది. ఈ ప్లాన్ ద్వారా ఒక ఫోన్ కాల్ లో 70 శాతం చెల్లించి, ఆ ఫోన్ ఏడాదిపాటు మీ దగ్గర వాడుకొని, వచ్చే సంవత్సరం అదే ఫోన్ కు సంబంధించి కొత్తగా వచ్చిన మోడల్ ఒక పైసా అదనంగా చెల్లించాల్సిన పనిలేకుండా మీ దగ్గర ఉన్న పాత ఫోన్ వెనక్కి ఇచ్చి కొత్త ఫోన్ తీసుకోవచ్చు. ఈ లెక్కన Samsung Galaxy S20+ని Flipkart Big Billion Days సేల్‌లో 49,999 రూపాయలకు అప్పటికే డిస్కౌంట్ కింద లభిస్తున్న Galaxy s20+ని 30 శాతం తగ్గింపు తో, కేవలం 70 శాతం విలువ, అంటే 35,000 రూపాయలు మరియు, ప్రోగ్రామ్ ఫీజ్ క్రింద మరో 199 రూపాయలు మొత్తం 35,198 రూపాయలు చెల్లించి సొంతం చేసుకోవచ్చు.

అయితే ఈ ప్రత్యేకమైన ఆఫర్ క్రెడిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న వారికి మాత్రమే లభిస్తుంది. ఈ ఆఫర్‌కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు ఈ లింక్‌లో చూడొచ్చు.

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

Computer Era
Logo