
తాను సర్వీస్ అందిస్తున్న అన్ని నగరాల్లో తక్కువ ధరకే వేగవంతమైన, నాణ్యమైన broadband సేవలందిస్తున్న ACT Fibernet సంస్థ ఓ సరికొత్త డివైస్ వినియోగదారుల కోసం అందుబాటులో తీసుకోబోతోంది.
ACTTV+ పేరుతో పిలవబడే ఈ device మనం ప్రతి రోజూ చూసే Google Chromecast, Amazon Fire Stickలకు పోటీగా తీసుకురాబడుతోంది. అయితే ఈ రెండు డివైజ్లకు భిన్నంగా ఇది Android ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేస్తుంది. ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం ఇందులో మనకు కావాల్సిన ఆండ్రాయిడ్ అప్లికేషన్లు, గేమ్స్ ఇన్స్టాల్ చేసుకొని నేరుగా మన టీవీ లో వాడుకోవచ్చు. మీ దగ్గర వున్నది స్మార్ట్ టీవీ కాకపోయినా దాని ద్వారా అన్ని రకాల ప్రయోజనాలు పొందడానికి ఇది పనికొస్తుంది.
ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరంలోని కొందరు ఎంపిక చేయబడిన వినియోగదారులకు ప్రయోగాత్మకంగా ఈ ACTTV+ స్ట్రీమింగ్ డివైజ్ అందించబడింది. అర్హులైన ACT Fibernet ఖాతాదారులకు ఉచిత ACTTV+ ట్రయల్ ప్రోగ్రామ్ స్వీకరించమని ఈమెయిల్స్ పంపిస్తోంది. అటు HDMI ద్వారా గానీ, USB పోర్ట్ ద్వారా గానీ దీన్ని మనం టీవీ కి కనెక్ట్ చేసుకోవచ్చు.