ACT Fibernet ఈరోజు హైదరాబాద్ తాజ్ కృష్ణా హోటల్లో తెలంగాణ IT శాఖా మంత్రి KTR సమక్షంలో ఓ సరికొత్త planని ప్రకటించింది.”కంప్యూటర్ ఎరా”కు కూడా ఈ ఈవెంట్‌కి ఆహ్వానం లభించింది. ఈ కొత్త plan ప్రకారం 1 Gbps స్పీడ్ ఉన్న కనెక్షన్‌ని యూజర్లకి ఇవ్వబోతున్నారు.
మొట్టమొదట ఈ ప్లాన్ హైదరాబాద్‌లో లభిస్తుంది. ఆ తర్వాత దేశంలోని ఇతర ప్రాంతాల్లో మొదలవుతుంది. ఇప్పటి వరకూ దేశంలో 1 Gbps స్పీడ్ ఉన్న నెట్ సౌకర్యాన్ని వేరే ఏ సంస్థా అందించలేదు. ఈ ఘనత Act Fibernetకి దక్కుతుంది. ఈ plan కోసం యూజర్లు రూ. 5,999 చెల్లించాల్సి ఉంటుంది.
ప్రతీ నెలా 1 TB fair usage limitగా విధించబడుతుంది. ఎలాంటి టెలికం లైసెన్స్ లేకపోయినా అద్భుతమైన fiber-optic టెక్నాలజీని తాము కలిగి ఉన్నట్లు ACT CEO బాల మల్లాది తెలిపారు. త్వరలో తాము సర్వీసులు అందిస్తున్న ఇతర 11 నగరాల్లో ఈ 1Gbps స్పీడ్ ఇవ్వబోతున్నామని ఆయన తెలిపారు.