మీరు Act Fibernet broadband కనెక్షన్‌ని కలిగి ఉన్నారా? అయితే మీకు ఓ మంచి తీపి కబురు. ఒక్క రూపాయి అదనంగా చెల్లించాల్సిన పనిలేకుండానే మీ plans అప్‌గ్రేడ్ చెయ్యబడ్డాయి.
ప్రస్తుతానికి హైదరాబాద్ నగరానికి చెందిన Act Fibernet యూజర్లకి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఈ మారిన ప్లాన్ల ప్రకారం A-Max 410 యూజర్లకి 5 Mbps ఉన్న ప్రస్తుత స్పీడ్ నుండి 15 Mbps స్పీడ్, నెలకి 75 GB FUP లిమిట్ లభిస్తాయి. అలాగే A-Max Swift ప్లాన్ వాడుతున్న యూజర్లకి 5 Mbps స్పీడ్ నుండి 15 Mbps స్పీడ్కీ 100 GB FUP లిమిట్కీ పెంచడం జరిగింది.
A-Max 650 ప్లాన్ వాడుతున్న యూజర్ల కోసం ప్రస్తుతం వారికి లభిస్తున్న 25 Mbps స్పీడ్ నుండి 40 Mbps స్పీడ్, 150 GB FUP లిమిట్ లభిస్తున్నాయి. A-Max Rapid FT ప్లాన్ వాడుతున్న యూజర్లకి 30 Mbps స్పీడ్ కాస్తా 45 Mbps స్పీడ్కీ, 175 GB FUP లిమిట్కీ పెంచబడింది.