
మీరు హైదరాబాద్, చెన్నై నగరాల్లో నివసిస్తూ Act Fibernet ఇంటర్నెట్ కనెక్షన్ కలిగి ఉన్నట్లైతే ఇప్పుడు మీకు కావలసినంత డేటా లభించబోతోంది.
చెన్నైలో నివసిస్తూ, ఇప్పటికే వివిధ Act Fibernet Planలకు subscribe చేసినవారికి మార్చి ఒకటి 2018 నుండి ఆగస్టు 31, 2018 లోపు వాడుకోగలిగే విధంగా ఇప్పటికే వారి ప్లాన్ ద్వారా లభించే FUP లిమిట్‌కి అదనంగా మరో 1500 GB డేటాని Act Fibernet క్రెడిట్ చేయబోతోంది. ఈ 1500 GB డేటా ఆరు నెలలకు విభజించబడి కస్టమర్ల అకౌంట్లకు ప్రతినెలా క్రెడిట్ చేయబడుతుంది.
అలాగే హైదరాబాద్లో నివసించే Act Fibernet వినియోగదారులకు అదే ఆరు నెలల కాలానికి 1000 GB మొత్తంలో అదనపు డేటా ఉచితంగా ప్రతీ యూజర్ అకౌంట్ లో క్రెడిట్ చేయబడుతుంది. వాస్తవానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్లో చెన్నై సూపర్ కింగ్స్‌ని సపోర్ట్ చేసే విధంగా ఈ ప్లాన్ ప్రవేశపెట్టబడింది. అయితే వినియోగదారుల్ని ఆకర్షించడం కోసం ఇదే ప్లాన్ చిన్నచిన్న మార్పులతో ఇతర నగరాల్లోనూ ఇప్పుడు లభిస్తోంది.