ACT Fibernet వరంగల్‌లో Broadband సేవలు మొదలుపెట్టింది..

act fibernet warangal

ఇప్పటికే దేశవ్యాప్తంగా 15 ప్రముఖ నగరాల్లో  బ్రాడ్బ్యాండ్ సర్వీసులు అందిస్తున్న ACT Fibernet  తాజాగా వరంగల్‌లో ఇంటర్నెట్ సేవలు ప్రారంభించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఇప్పటికే పది నగరాల్లో ఈ సంస్థ సేవలందిస్తోంది.

ప్రస్తుతానికి వరంగల్‌లో  రెండు ప్యాకేజీలను అందిస్తోంది. ACT Swift, ACT Rapid పేర్లతో  వీటిని పిలుస్తారు. ACT Swift బ్రాడ్బ్యాండ్ ప్లాన్ కోసం నెలకు 549 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. 50 Mbps డౌన్లోడ్ + అప్లోడ్ స్పీడ్  ఈ ప్లాన్ ద్వారా అందించబడుతుంది. నెలకు 400 GB వరకూ ఫెయిర్ యూసేజ్ పాలసీ క్రింద 50 Mbps స్పీడ్ పొందొచ్చు. అంతకన్నా ఎక్కువ వాడుకుంటే మరుసటి బిల్లింగ్ సైకిల్ వరకు 512 Kbps స్పీడ్‌తో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది.

ఇక రెండో ప్లాన్ అయిన ACT Rapid  బ్రాడ్బ్యాండ్ ప్లాన్ విషయానికొస్తే దీనిద్వారా 100 Mbps డౌన్లోడ్ + అప్లోడ్ స్పీడ్  లభిస్తుంది. అలాగే నెలకు 800 GB వరకూ పరిమితి ఉంటుంది. ఆ తర్వాత మరుసటి బిల్లింగ్ సైకిల్ వరకు 1 Mbps  స్పీడు మాత్రమే లభిస్తుంది. దీనికోసం నెలకు 999 రూపాయల చెల్లించవలసి ఉంటుంది.

ఆరునెలలు గానీ,  9 నెలలు, సంవత్సరంపాటు ఒకేసారి చెల్లించే వారి కోసం పలు ఆఫర్లను ఈ సంస్థ అందిస్తోంది.  ఉదాహరణకు ఆరునెలలకు చెల్లిస్తే ఒక నెల అదనంగా ఉచితంగా అందించడంతోపాటు, ఇన్‌స్టలేషన్ ఛార్జీలలో  75 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. 9 నెలలు ప్లాన్ ఎంచుకున్న వారికి ఉచితంగా WiFi Routerతో పాటు  ఇన్స్టాలేషన్ ఛార్జీలలో 75 శాతం రాయితీ లభిస్తుంది. 12 నెలల ప్లాన్ ఎంచుకున్న వారికి రెండు నెలల పాటు ఉచితంగా బ్రాడ్బ్యాండ్ సేవలు లభించడంతోపాటు,  ఉచిత వైఫై రౌటర్, ఇన్‌స్టలేషన్ ఛార్జీలలో 75 శాతం రాయితీ అందించబడతాయి.

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

అనేక ఇతర ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల తో పోలిస్తే ACT Fibernet  సేవల పట్ల చాలా మంది వినియోగదారులు హైదరాబాద్ వంటి నగరాల్లో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  తక్కువ ధరకే మెరుగైన ఇంటర్నెట్ కనెక్టివిటీ అందిస్తున్న ఈ సంస్థ Reliance Jio Giga Fiber వచ్చిన తర్వాత ఆ పోటీని ఎలా తట్టుకుంటుందో వేచి చూడాలి.

Tags:

Computer Era
Logo
Enable registration in settings - general