
మీ ఇంట్లో ACT Fibernet ఇంటర్నెట్ కనెక్షన్‌ని వాడుతున్నారా? అయితే మీరు హాపీగా తెలుగు, తమిళ్, కన్నడ, ఇంగ్లీష్, హిందీ వంటి 12 భాషల్లోని వందల కొద్దీ ఛానెళ్లని ఉచితంగా చూడొచ్చు.
మీరు ACT Fibernetలో ఎలాంటి planకి సబ్‌స్కైబ్ చేసి ఉన్నా ఫర్లేదు. మీరు నిరభ్యంతరంగా live tv ఛానెళ్లని మీ mobileలో యాక్సెస్ చేసుకోవచ్చు. వాస్తవానికి ఇటీవల ACT Fibernet సంస్థ Entertainment Plan అనే కొత్త ప్లాన్‌ని కేవలం live ఛానెళ్లు, video on demand కోసం తీసుకు వచ్చింది. అయితే ఆ ప్లాన్‌కి subscribe చెయ్యవలసిన పని లేకుండానే ACT Fibernet వాడుతున్న ప్రతీ కస్టమర్‌కీ ఆ ప్లాన్ ప్రయోజనాలను ఆరు నెలల పాటు ఉచితంగా అందిస్తోంది.
దీన్ని పొందడానికి మీరు చెయ్యవలసిందల్లా మీ Android phoneలో Act Fibernet appని డౌన్‌లోడ్ చేసుకుని.. దానిలో మీ ACT username, passwordలతో లాగిన్ అయి.. Entertainment అనే విభాగంలో Yupp TV ద్వారా వందల ఛానెళ్లని ఉచితంగా చూడొచ్చు. ఆర్నెల్ల పాటు ఈ Yupp TV subscription ఉచితంగా లభిస్తుంది. అంతే కాదు.. రెండు నెలల పాటు HOOQ subscriptionనీ, Fastfilmz, ALTBalaji సబ్‌స్క్రిప్షన్లని ఒక నెల పాటు కూడా ఉచితంగా పొందొచ్చు.