ACT Fibernet వాడుతున్న వినియోగదారులకు శుభవార్త!

ACT Fibernet 100 GB additional data

దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ACT Fibernet  బ్రాడ్బ్యాండ్ సేవలను పొందుతున్న వినియోగదారులకు శుభవార్త. Jio Gigafiber  సర్వీస్ మార్కెట్లోకి రాబోతున్న తరుణంలో ఇప్పటికే సుదీర్ఘ కాలంగా మార్కెట్లో ఉన్న ACT Fibernet  తన వినియోగదారులను ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తోంది.

ఇందులో భాగంగా తాజాగా తన సేవలను వినియోగించుకుంటున్న వినియోగదారులకు ఇప్పటి వరకు వారి ప్యాకేజి ద్వారా లభిస్తున్న  ప్రయోజనాలకు అదనంగా 100 GB డేటాను ప్రతినెలా అందించబోతోంది. ఉదాహరణకు మీరు హైదరాబాద్ లో నివసిస్తూ, 1050 రూపాయల విలువ కలిగిన ప్యాకేజీకి  సబ్స్క్రైబ్ చేసి ఉన్నట్లయితే, ఇప్పటివరకు మీకు నెలకు లభిస్తున్న 750 GB బ్రాడ్బ్యాండ్ డేటాకి అదనంగా మరో 100 GB… అంటే మొత్తం కలిపి 850 GB డేటా లభిస్తుంది అన్నమాట.

వాస్తవానికి ఫిబ్రవరి 2019లో ACT Fibernet ఇలా అదనంగా డేటా అందించడం మొదలు పెట్టింది.  అయితే అది తాత్కాలికమే అనుకున్నప్పటికీ మే 31 2019 వరకు దేశవ్యాప్తంగా ఉన్న అందరూ ACT ఫైబర్ నెట్ వినియోగదారులకు డేటా అందించడం జరుగుతుందని ఆ సంస్థ వెల్లడించింది. కాబట్టి ఒకవేళ మీరు అసలు సర్వీసులు వాడుతున్నట్లయితే, అలాగే మీ డేటా వినియోగం విపరీతంగా ఉన్నట్లయితే కచ్చితంగా దీని వలన ప్రయోజనం పొందగలుగుతారు.

బ్రాడ్బ్యాండ్ రంగంలో ఇలాంటి అనేక ఆఫర్లు మునుముందు రాబోతున్నాయి.  దీని వల్ల పరోక్షంగా వినియోగదారులు ప్రయోజనం పొందుతారు అనడంలో సందేహం లేదు. ACT  ఫైబర్ నెట్ అందిస్తున్న ఈ అదనపు డేటా పొందాలంటే కనుక, మీ ఫోన్లో ఆ సంస్థకు సంబంధించిన అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుని,  అందులో మీ అకౌంట్లోకి లాగిన్ అయి అక్కడ యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. Google Play Storeలో ఆ అప్లికేషన్ మనకు లభిస్తుంది.

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

Tags:

Computer Era
Logo
Enable registration in settings - general