ACT Fibernet స్పీడ్ పెంచేసింది.. ఇప్పుడు ఉన్న ప్లాన్ లోనే ఎక్కువ స్పీడ్!

ACT Fibernet new broadband speed

Reliance JioFiber బ్రాడ్బ్యాండ్ రంగంలోకి ప్రవేశించిన తర్వాత, అందులో కూడా విపరీతమైన పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఇటీవల దేశవ్యాప్తంగా బ్రాడ్బ్యాండ్ సేవలు అందించే అనేక సంస్థలు తమ ప్లాన్ లను మరింత ఆకర్షణీయంగా తయారు చేస్తున్నాయి.

ముఖ్యంగా ఇటీవల JioFiber తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలు అందించే కొత్త ప్లాన్స్ ప్రకటించిన తర్వాత పరిస్థితి సమూలంగా మారిపోయింది. ఇదే క్రమంలో తాజాగా దేశవ్యాప్తంగా సేవలందిస్తున్న ACT Fibernet ఇప్పటికే ఉన్న ప్లాన్స్ యొక్క స్పీడ్ మరియు, FUP లిమిట్ పెంచడం గమనార్హం. బెంగళూరు నగరంలో ఉన్న వినియోగదారులకు సంబంధించిన ప్లాన్స్ వివరాలు ప్రస్తుతానికి తెలిశాయి. దేశవ్యాప్తంగా అన్ని సర్కిళ్లలో దాదాపు ఇదే విధమైన కొత్త ప్లాన్స్ ACT Fibernet ద్వారా అందుబాటులోకి వస్తున్నట్లు సమాచారం.

అప్గ్రేడ్ చేయబడిన ప్లాన్స్ విషయానికొస్తే, అన్నిటికంటే మొట్టమొదటిది ACT Blaze ప్లాన్. ఇది ఇప్పటి వరకు 100 Mbps స్పీడ్, నెలకు 450 జీబీ డేటా ప్రయోజనాలు అందించేది. అయితే ఇప్పుడు దాన్ని స్పీడ్ 150mbps, 1000 GB డేటా అందించబడే విధంగా మార్పిడి చేశారు. అయితే ధర మాత్రం ఇప్పటికే చెల్లిస్తున్న 1,085 రూపాయలు మాత్రమే ఉంటుంది.

బెంగళూరు సర్కిల్ లో అప్గ్రేడ్ చేయబడిన రెండో ప్లాన్ ACT Strom. ఇప్పటివరకు 150mbps, 650 జిబి డేటా మాత్రమే అందించబడుతున్న ఈ ప్లాన్ ఇప్పుడు, 200 mbps స్పీడ్, 1500GB డేటా పరిమితి కలిగి ఉంటుంది. ఎప్పటిలాగే 1185 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. 1425 రూపాయల విలువ కలిగిన ACT Lightning ప్లాన్ ద్వారా ఇప్పటి వరకు 200 mbps స్పీడ్, 800GB డేటా లభిస్తూ ఉండేది. అయితే ఇప్పుడు ఇదే ప్లాన్ 250Mbps స్పీడ్, 2000GB డేటాకి ఉచితంగా అప్డేట్ చేయబడింది.

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

1999 రూపాయల విలువ కలిగిన ACT Incredible ప్లాన్ విషయానికొస్తే, ఇప్పటివరకు 250 mbps స్పీడ్, 1000GB డేటా లభిస్తున్నది కాస్తా తాజాగా 300mbps స్పీడ్, 3000GB బ్రాడ్బ్యాండ్ డేటా అందించబడుతుంది. ఇదేవిధంగా 2,999, 3,999, 4,999 రూపాయల విలువ కలిగిన ప్లాన్స్ కూడా అదనంగా ఎలాంటి రుసుము చెల్లించిన పనిలేకుండా అప్గ్రేడ్ చేయబడ్డాయి. రాబోయే కొద్ది రోజుల లోపల ఇతర నగరాల్లో ఉన్న ACT Fibernet వినియోగదారులకు కూడా వారి ప్లాన్స్ ఉచితంగా అప్గ్రేడ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

Computer Era
Logo
Enable registration in settings - general