

Airtel, Reliance Jio వంటి టెలికాం కంపెనీలు వినియోగదారులను మరింతగా పట్టుకోవటానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగా ఇటీవల కాలంలో వివిధ OTT సబ్స్క్రిప్షన్‌లను కొన్ని ప్లాన్లతో ఉచితంగా అందించటం గమనార్హం.
అదే క్రమంలో తాజాగా Airtel సంస్థ Airtel Postpaid కనెక్షన్ కలిగి ఉన్న వినియోగదారులతో పాటు Airtel Broadband కలిగి ఉన్న వినియోగదారులకు కూడా Disney+ Hotstar ఉచిత సబ్స్క్రిప్షన్ అందించడానికి సన్నాహాలు చేసింది. అయితే ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. బ్రాడ్బ్యాండ్ మరియు postpaid సబ్స్క్రిప్షన్ కలిగి ఉన్న అందరికీ ఈ ఆఫర్ లభించదు. పోస్ట్పెయిడ్ వినియోగదారులు 499 రూపాయల కంటే ఎక్కువ విలువ కలిగిన ప్లాన్ కలిగి ఉంటే వారు ఈ ఆఫర్ పొందొచ్చు.
మరోవైపు Airtel Broadband ఉపయోగిస్తున్న వినియోగదారులు 999 రూపాయల కంటే ఎక్కువ విలువ కలిగిన ప్లాన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఈ ఆఫర్ కి అర్హత సాధిస్తారు. కేవలం Airtel Thanks Platimum ద్వారా మాత్రమే ఈ ఉచిత ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. మీ ఫోన్లో ఉండే Airtel Thanks అప్లికేషన్లో Thanks అనే పేజీలో ఈ ఆఫర్ కి మీకు అర్హత ఉందో లేదో స్పష్టంగా పేర్కొనబడి ఉంటుంది. వాస్తవానికి Disney+ Hotstar VIP సబ్స్క్రిప్షన్ పొందటానికి 399 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. అలా చెల్లించిన వారికి ఏడాది పాటు వాలిడిటీ లభిస్తుంది.
ఇప్పుడు తాజాగా Airtel ఉచితంగా అందిస్తున్న ఈ ఆఫర్ కూడా, సంవత్సరం తర్వాత Disney+ Hotstar సబ్స్క్రిప్షన్ ఆటోమెటిగ్గా నిలిచిపోతుంది. ఇదిలా ఉంటే మరోవైపు Reliance Jio కొంతకాలం క్రితమే Jio Postpaid Plus అనే ప్లాన్ తీసుకొచ్చి పోస్ట్ వినియోగదారుల కోసం పలురకాల OTT సర్వీసులకు ఉచిత సబ్స్క్రిప్షన్ అందించడం మొదలు పెట్టిన విషయం తెలిసిందే. Airtel ఈ సంస్థ తాజాగా తీసుకువచ్చిన Disney+ Hotstar VIP ఉచిత సబ్స్క్రిప్షన్ ఆ స్థాయిలో కాకపోయినా పోస్ట్పెయిడ్ వినియోగదారులకు కాస్తోకూస్తో కంటితుడుపుగా అయినా నిలుస్తుంది.