
Smart Plugలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినియోగించబడుతున్నాయి. వివిధ సంస్థలకు చెందిన smart plugలు అందుబాటులో ఉన్నప్పటికీ Amazon సంస్థ కూడా Amazon Smart Plug ద్వారా ఈ విభాగంలో తన ఉత్పత్తిని విడుదల చేసింది. రూ. 1,999కి Amazonలో ఈ లింక్‌లో ఈ Amazon Smart Plugని కొనుగోలు చేయవచ్చు.
Amazon Smart Plug ద్వారా అప్పటివరకు మామూలుగా పనిచేసిన అన్ని రకాల విద్యుత్ ఉపకరణాలకు స్మార్ట్ సదుపాయాన్ని కల్పించవచ్చు. అంటే ఇకమీదట వాటిని మీ వాయిస్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు, ఒక నిర్దిష్టమైన సమయంలో అవి ఆటోమేటిక్గా ఆన్ మరియు ఆఫ్ అయ్యేవిధంగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఒకపక్క వైఫై ఆధారంగా పనిచేసే యూనివర్సల్ రిమోట్స్, స్మార్ట్ స్పీకర్లతో పాటు smart plugలు ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్!