Android 11 ఫైనల్ వెర్షన్ వచ్చింది.. కొత్త ఫీచర్స్ ఇవి!

Android 11 final version released new features

గత కొంత కాలంగా Beta దశలో ఉన్న Android 11 ఆపరేటింగ్ సిస్టమ్ ఎట్టకేలకు ఫైనల్ విషయం తాజాగా విడుదలైంది. ప్రస్తుతం Google Pixelతో పాటు, ఇతర కొన్ని కంపెనీలకు చెందిన phoneలకి లభిస్తున్న ఈ తాజా ఆపరేటింగ్ సిస్టం అతి త్వరలో దాదాపు అన్ని ఫోన్లకు లభించే అవకాశాలు ఉన్నాయి. Android 11లో అనేక కీలకమైన మార్పులు చోటు చేసుకున్నాయి.

Facebook Messengerలో చాలా కాలంగా కనిపిస్తున్న Chat bubbles లాంటి సదుపాయం ఇప్పుడు Android 11లో అన్ని రకాల అప్లికేషన్లకు లభిస్తుంది. సంబంధిత అప్లికేషన్ ప్రత్యేకంగా ఓపెన్ చేయాల్సిన పనిలేకుండా ఈ సదుపాయం ద్వారా ఛాట్ కన్వర్జేషన్ చేసుకోవచ్చు. అలాగే ప్రత్యేకంగా ఎలాంటి స్క్రీన్ రికార్డింగ్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన పనిలేకుండా, ఫోన్ తయారీ కంపెనీ కూడా తాము విడుదల చేసే ఫోన్లలో ప్రత్యేకంగా అందించాల్సిన పనిలేకుండా నేరుగా ఆపరేటింగ్ సిస్టంలోనే Screen Recorder సదుపాయం కల్పించబడుతోంది.

IoT ( ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) వినియోగం బాగా పెరిగిన నేపథ్యంలో మీ ఇంట్లో ఉన్న smart home లైట్లు, లాక్స్, కెమెరాలు వంటి వాటిని ప్రత్యేకంగా వాటికి సంబంధించిన అప్లికేషన్ ఓపెన్ చేయాల్సిన పని లేకుండా, నేరుగా పవర్ మెనూ ద్వారా వాటిని యాక్సెస్ చేయవచ్చు. ఫోన్ లో ఏదైనా కొత్తగా అప్లికేషన్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఆ అప్లికేషన్ కి శాశ్వతంగా పర్మిషన్స్ ఇవ్వడం కాకుండా, కెమెరా, మైక్రోఫోన్, లోకేషన్ వంటి వివిధ రకాల సెన్సార్లకి one-time permissionsని ఇచ్చే అవకాశం కూడా Android 11లో లభిస్తుంది. మీ ఫోన్ లో ఇప్పటికే ఇన్స్టాల్ చేయబడి ఉన్న అప్లికేషన్స్ చాలా కాలం పాటు ఉపయోగించకపోతే వాటికి గతంలో కేటాయించబడిన పర్మిషన్స్ మళ్లీ తిరిగి వెనక్కి తీసుకునే విధంగా కూడా ఈ కొత్త ఆపరేటింగ్ సిస్టం లో ఏర్పాటు ఉంటుంది.

దీంతోపాటు నోటిఫికేషన్ మరింత మెరుగ్గా మేనేజ్ చేసుకోవడం వంటి పలు కీలకమైన సదుపాయాలు Android 11లో లభిస్తున్నాయి. Google Pixel ఫోన్లతో పాటు Redmi K20 Pro, Essential PH-1 ఫోన్లకి ఈ ఫైనల్ వెర్షన్ వెంటనే లభిస్తుంది. దాంతోపాటు OnePlus 8, OnePlus 8 Pro, Realme X50, Mi 10, Mi 10 Pro, Find X2 Pro, Find X2, Ace 2, Reno3 4G, Reno 3 Pro 4G మోడళ్లకు ప్రస్తుతానికి Beta వెర్షన్ ప్రయత్నించవచ్చు. Samsung, Xiaomi వంటి ఇతర కంపెనీలకు చెందిన ఇతర మోడల్స్ కి దశలవారీగా 2021 మార్చి లోపల ఆండ్రాయిడ్ 11 అప్డేట్ లభిస్తుంది.

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

Computer Era
Logo