Android Nougatలో సూపర్ ఫీచర్

android-n-inner

త్వరలో విడుదల కాబోతున్న Android Nougat (7.0) ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఓ గొప్ప సదుపాయం ప్రవేశపెట్టబడింది. ఈ సదుపాయం గురించి Google పబ్లిక్‌గా ప్రకటించకపోయినప్పటికీ తాజాగా లభించిన source code ఆధారాలు దీన్ని బయటపెట్టాయి. అదేంటో తెలుసుకునే ముందు అసలు సమస్య ఏమిటో మొదట చూద్దాం.

ఇటీవల Ransomware attacks అనేవి smartphone యూజర్లని ముప్పుతిప్పలు పెడుతున్న సంగతి తెలిసిందే కదా. ఏదో app రూపంలో మన ఫోన్‌లోకి download అయి.. మన phoneలోని photos, videos, ఇతర డేటా మొత్తాన్ని encrypt చేయడంతో పాటు lock screen pinని కూడా మార్చి వేసి అసలు మనం ఇక మన phoneని వాడడానికి వీల్లేని విధంగా ఈ Ransomware అటాక్‌లు కట్టడి చేస్తుంటాయి. తిరిగి ఆ డేటాని dercrypt చెయ్యాలన్నా, lock screen పాస్‌వర్డ్ తొలగించాలన్నా 200 నుండి 500 dollars వరకూ అంటే భారతీయ కరెన్సీలో దాదాపు 30 వేల వరకూ చెల్లిస్తేనే గానీ డేటాని తిరిగి ఇస్తామని అవి డిమాండ్ చేస్తాయి.

ఎంతో మంది తమ smartphoneలు ransomware బారిన పడ్డాయని మన “కంప్యూటర్ ఎరా” దృష్టికి  తీసుకు వచ్చారు. రానురానూ అధికం అవుతున్న ఈ ransomware దాడుల నుండి తన యూజర్లకి రక్షణ కల్పించాలని Google భావించింది. అందుకే రాబోయే Android Nougat ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఈ మేరకు ఓ కీలకమైన మార్పుని source codeలో చేసింది. Reset Password APIలో ఈ మార్పు చోటు చేసుకుంది.  ఇంతకాలం ఇప్పటికే మీరు మీ smartphoneకి PIN గానీ, pattern గానీ lock సెట్ చేసుకుని ఉన్నా ransomware టూల్స్ దాన్ని రీసెట్ చేసి తాము కొత్త PIN, patternలను సెట్ చెయ్యగలుగుతాయి. అలా వాటిని మార్చడం ద్వారా మనం phone unlock చెయ్యకుండా అడ్డుకుంటూ ఉంటాయి.

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

అయితే ఈ Reset Password APIలో చేసిన తాజా మార్పు వల్ల ఇలా థర్డ్ పార్టీ ransomware కావచ్చు, ఇతర apps కావచ్చు మన PIN, patternలను reset చేసే అవకాశం కోల్పోతాయి.  ఒక userగా మనం మొదటిసారి PIN, patternలను సెట్ చేసుకోవడం వరకే అనుమతించబడుతుంది. ఆ తర్వాత దాన్ని బలవంతంగా Admin హోదాలో ఇతర యాప్స్ reset చెయ్యడం కుదరదన్నమాట. ఒకవేళ PIN, patternలను మార్చుకోవాలంటే అది మనకే సాధ్యపడుతుంది. ఈ ఒక్క చిన్న మార్పుతో చాలావరకూ ransomwareల వల్ల అస్సలు phone వాడలేని పరిస్థితి నుండి ఉపశమనం లభిస్తుంది. అయితే ఈ కొత్త ఆప్షన్ వల్ల ప్రయోజనం పొందాలంటే తప్పనిసరిగా మనం phoneని కొన్న తర్వాత మనకి మనం PIN లేదా patternలను సెట్ చేసుకోవాలి. లేదంటే మనకు తెలీకుండా ఈ ransomwareలు మొదటిసారి ఉన్న అవకాశాన్ని తాము వాడుకుని PIN, patternలను సెట్ చేసి మనల్ని ఇబ్బంది పెడతాయి.

Computer Era
Logo
Enable registration in settings - general