Android phoneలలో కొత్తగా వస్తున్న మరో ఫీచర్ ఇది!

Android Digital wellbeing grayscale

Android ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే ఫోన్లలో గూగుల్ సంస్థ ఎప్పటికప్పుడు అనేక కొత్త సదుపాయాలు ప్రవేశ పెడుతూ ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా గత రెండేళ్ల నుండి Digital Wellbeing అనే సదుపాయం దాదాపు అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో అంతర్గతంగా లభిస్తోంది.

స్మార్ట్ ఫోన్ అడిక్షన్ ఎక్కువ అవుతున్న నేపథ్యంలో, స్మార్ట్ ఫోన్ మీద నిర్దిష్టమైన సమయం మాత్రమే గడిపే విధంగా పరిమితి విధించడం కోసం ఈ సదుపాయం ఉపయోగపడుతుంది. Android 9, Android 10 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే దాదాపు అన్ని ఫోన్లలో డిజిటల్ వెల్ బీయింగ్ సెట్టింగ్స్ లభిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా Facebook, Youtube, PUBG వంటి ఏదైనా అప్లికేషన్ కి బాగా బానిస అయినట్లయితే, ఆ నిర్దిష్టమైన అప్లికేషన్ కి రోజు మొత్తం మీద కొంత పరిమిత సమయం మాత్రమే కేటాయించే విధంగా ఇది అవకాశం కల్పిస్తుంది.

కేటాయించబడిన సమయం పూర్తయిన తర్వాత ఆ అప్లికేషన్ కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ నిలుపుదల చేయబడతాయి. అయితే కావాలంటే ఈ పరిమితిని అన్ లాక్ చేసుకుని తిరిగి దాన్ని ఉపయోగించుకోవచ్చు అనుకోండి. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ డిజిటల్ వెబ్ బీయింగ్ సదుపాయానికి తాజాగా మరో అద్భుతమైన సదుపాయం అందుబాటులోకి వచ్చింది. కావాల్సిన అప్లికేషన్ పూర్తిగా డిజేబుల్ చేయటం మాత్రమే కాకుండా, తాజాగా వచ్చిన ఆప్షన్ ద్వారా సంబంధిత అప్లికేషన్ కలర్ లో నుండి బ్లాక్ అండ్ వైట్ లోకి మారిపోయే విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు.

నిర్దిష్టమైన సమయం పూర్తయిన తర్వాత ఆటోమేటిగ్గా మీరు సెలెక్ట్ చేసుకున్న Facebook, Whatsapp వంటి అప్లికేషన్ కలర్ నుండి బ్లాక్ అండ్ వైట్ గా మారిపోతుంది. ఇలా కలర్ మారటం వల్ల కచ్చితంగా దాన్ని ఉపయోగించాలన్న కోరిక తగ్గిపోతుంది. పరోక్షంగా దాని అడిక్షన్ కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. Android ఆపరేటింగ్ సిస్టం వాడుతున్న అందరు వినియోగదారులకు రాబోయే కొద్ది వారాలు లోపల ఈ కొత్త సదుపాయం Google Play Services ద్వారా అందుబాటులోకి రాబోతోంది.

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

గమనిక: Whatsappలో అన్ని లేటెస్ట్ Tech Updates కోసం https://chat.whatsapp.com/JMyfXBZdWl5BUR7SGHT3YY అనే గ్రూప్‌లో జాయిన్ అవండి. లేదా గమనిక: Telegramలో వాడేవారు లేటెస్ట్ Tech Updates కోసం https://t.me/sridharcera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.
Computer Era
Logo