Android TV మీ దగ్గర ఉంటే Android TV 11 అప్డేట్ వచ్చింది.. కొత్తగా వచ్చిన ఫీచర్స్ ఇవే!

Android TV 11 new features

కొద్ది రోజుల క్రితం smartphoneల కోసం Android 11 ఆపరేటింగ్ సిస్టమ్ అందుబాటులోకి తీసుకు రాబడిన విషయం గుర్తుండే ఉంటుంది. కేవలం స్మార్ట్ ఫోన్స్ మాత్రమే కాదు, ఇటీవల కాలంలో Android TV ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే అనేక స్మార్ట్ టీవీలు కూడా వినియోగంలో ఉన్నాయి.

ఈ నేపథ్యంలో Android TVలకు కూడా లేటెస్ట్ ఆండ్రాయిడ్ 11 TV ఆపరేటింగ్ సిస్టం ప్రకటించబడింది. కేవలం టీవీల కోసమే ఉద్దేశించబడిన అనేక కొత్త సదుపాయాలు దీంట్లో ప్రవేశపెట్టబడ్డాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టం లో ఉండే ముఖ్యమైన సదుపాయాలన్నీ Android TV 11లో కూడా అందించబడతాయి. అనేక ప్రైవసీ ఫీచర్లు మరింత మెరుగుపరచబడ్డాయి.

అలాగే మీడియా సపోర్ట్ విషయంలో, ఆండ్రాయిడ్ టీవీ 11లో ఆటో లో లేటెన్సీ మోడ్, లో లేటెన్సీ మీడియా డీకోడింగ్ వంటి సదుపాయాలు వచ్చాయి. అప్డేటెడ్ మీడియా సపోర్ట్ తో సరికొత్త ట్యూనర్ ఫ్రేమ్‌వర్క్ ప్రవేశపెట్టబడింది. మరోవైపు గూగుల్ సంస్థ గేమ్ ప్యాడ్‌లకు సపోర్ట్ విస్తరిస్తున్న నేపథ్యంలో, TVలలో Stadia సపోర్ట్ కూడా వచ్చింది.

Android TV ఆపరేటింగ్ సిస్టం కోసం ప్రత్యేకంగా అప్లికేషన్స్ డెవలప్ చేసే డెవలపర్లకు, వారి అప్లికేషన్స్‌ని వేగంగా టెస్ట్ చేయడం కోసం ప్రత్యేకమైన మోడ్ ప్రవేశపెట్టబడింది. అలాగే గూగుల్ ప్లే స్టోర్ నుండి ప్రత్యేకంగా అప్లికేషన్స్ పూర్తిస్థాయిలో డౌన్లోడ్ చేసుకోవాల్సిన పని లేకుండా, తాత్కాలికంగా రన్ చేసుకునే విధంగా ఇన్స్టెంట్ అప్లికేషన్స్ సదుపాయం కూడా వచ్చింది.

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

Android TVలను వాడుతున్న వినియోగదారులు, తమకు కావాల్సిన కంటెంట్ కోసం కీబోర్డ్ మీద మరింత వేగంగా టైపింగ్ చేయడం కోసం, స్పీచ్ టు టెక్స్ట్, ప్రిడిక్టివ్ టైపింగ్ లాంటి సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. రాబోయే కొద్ది నెలల్లో దాదాపు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని టీవీ తయారీ సంస్థలు ప్రస్తుతం మీరు వాడుతున్న Android TV ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే టీవీలకు లేటెస్ట్ ఆండ్రాయిడ్ టీవీ 11 అప్డేట్ అందించే ప్రయత్నాలు చేస్తున్నాయి.

Computer Era
Logo