Apple iPhone యూజర్ల మీద నిఘా పెట్టాలని Facebook ప్రయత్నించిందా?

facebook spying on users

Facebook సంస్థ ఎప్పటికప్పుడు అనేక వివాదాల్లో కూరుకుంటూనే ఉంటుంది. కొద్దికాలం క్రితం cambridge analytica వివాదం, ఆ తర్వాత టెన్ ఇయర్ ఛాలెంజ్ పేరుతో పెద్ద మొత్తంలో వినియోగదారుల ముఖ కవళికలకు సంబంధించిన డేటా సేకరించింది అనే ఆరోపణల తర్వాత మళ్లీ తాజాగా మరో వివాదం దాని చుట్టూ నెలకొంది.

2018లో Whatsappలోని సెక్యూరిటీ బగ్ ఆధారంగా పనిచేసే Pegasus గురించి ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఆందోళన వ్యక్తం చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. కేవలం ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారా వాట్సప్ యూజర్ల ఫోన్లని హ్యాక్ చేయడం కోసం ఇజ్రాయిల్‌కి చెందిన NSO గ్రూప్ ఈ సాఫ్ట్వేర్ తయారు చేయడం జరిగింది.

ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు, ప్రభుత్వాలు సామాజిక కార్యకర్తల మీద నిఘా పెట్టడం కోసం ఈ టూల్ వాడినట్టుగా ఆధారాలు కూడా వెల్లడయ్యాయి. ఈ నేపథ్యంలో Facebook సంస్థ కూడా ఆ NSO సంస్థ నుండి Pegasus టూల్ కొనుగోలు చేయడానికి ప్రయత్నించింది అనే విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఫేస్బుక్ సంస్థకు చెందిన ఇద్దరు ప్రతినిధులు అక్టోబర్ 2017లో ఈ టూల్ కొనుగోలు గురించి NSOని సంప్రదించినట్లు తెలుస్తోంది.

యూజర్ల మీద నిఘా పెట్టడానికి ఫేస్బుక్ ప్రయత్నించడం ఇది తొలిసారి కాదు. కొన్ని సంవత్సరాల క్రితం ఫేస్ బుక్ ఉచితంగా VPN అందిస్తున్నామని చెబుతూ, Oneavo Protect అనే ఒక టూల్ తీసుకువచ్చింది. అయితే అది VPN కంటే స్పైవేర్ గా ఎక్కువగా పనిచేస్తోంది, ఫేస్ బుక్ వినియోగదారులకు సంబంధించిన డేటాను దానిద్వారా ట్రాక్ చేస్తోంది అనే ఆధారాలు అప్పట్లో లభించాయి. యాపిల్ ఐఫోన్ మరియు ఐప్యాడ్ వాడే వినియోగదారుల మీద నిఘా పెట్టడం కోసం Facebook ఈ Pegasusని కొనుగోలు చేయడానికి ప్రయత్నించినట్లు తెలుస్తుంది.

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

టెక్నాలజీ సంస్థలు మరింత బాధ్యతగా వ్యవహరించవలసిన పరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉంది. లేదంటే వినియోగదారుల ఆదరణ కోల్పోయే ప్రమాదం ఉంది.

Tags:

Computer Era
Logo
Enable registration in settings - general